Switch to English

నాట్యం మూవీ రివ్యూ

Critic Rating
( 2.00 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow
Movie నాట్యం
Star Cast సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు
Director రేవంత్ కోరుకొండ‌
Producer నిశ్రింక‌ళ ఫిల్మ్‌
Music శ్రవణ్ భ‌రద్వాజ్‌
Run Time 2 hr 16 Mins
Release అక్టోబర్ 22, 2021

క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో మన్ననలు అందుకున్న సంధ్య రాజు హీరోయిన్ గా డెబ్యూ చేసిన చిత్రం నాట్యం. ఆమె ఈ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మించింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

సితార (సంధ్య)కు తన ఊరిలో కాదంబరి నాట్యాన్ని పెర్ఫర్మ్ చేయాలన్నది కల. అయితే ఆమె గురువు మాత్రం దానికి వ్యతిరేకం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఊరు నుండి వెలివేయబడుతుంది. అదే ఊరిలో ఉండే రాహుల్ (కమల్ కామరాజు) దీని వెనుక ఉంటాడు. ఆమెను ఎందుకు ఊరి నుండి వెలివేస్తారు? కాదంబరి నాట్యాన్ని ప్రదర్శించాలన్న ఆమె కల నెరవేరుతుందా? చివరికి సితార జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

నటీనటులు:

సంధ్య రాజు ఒక పేరున్న క్లాసికల్ డ్యాన్సర్. సినిమాలో నాట్యం బేస్ తో ఉన్న సన్నివేశాల్లో ఆమె చాలా బాగా రాణించింది. అయితే ఎమోషన్స్ ను పండించాల్సిన సందర్భాల్లో మాత్రం ఆమె చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అయితే ఇది ఆమె మొదటి సినిమా అని మనం గుర్తించాలి. కమల్ కామరాజు విలన్ పాత్రలో రాణించాడు. నాట్య గురువుగా ఆదిత్య మీనన్ పెర్ఫార్మన్స్ బాగుంది. మిగిలిన వారందరూ తమ పరిధులు మేరకు నటించారు.

సాంకేతిక నిపుణులు:

ఈ సినిమాతో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో డెబ్యూ చేసాడు. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ను కూడా హ్యాండిల్ చేసాడు. అయితే ఎందులోనూ పూర్తిగా న్యాయం చేయలేకపోయాడు. సెటప్ ఆసక్తికరంగానే ఉంది. కానీ నరేషన్ తోనే వచ్చింది సమస్య అంతా. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. మిగిలిన డిపార్ట్మెంట్స్ తో పోల్చుకుంటే చాలా బెటర్. శ్రవణ్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. అయితే పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటూ ఏం లేదు. కాస్ట్యూమ్ డిజైనర్ గా సంధ్య రాజు పనిచేసింది. ఆమె వర్క్ ఈ డిపార్ట్మెంట్ పరంగా బాగుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి.

డ్యాన్స్ ఎపిసోడ్స్ ను పక్కన పెడితే దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు అన్నీ కూడా చాలా సాధారణంగా, లాజిక్ లు లేకుండా అనిపిస్తున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • కాదంబరి నాట్యం ఎపిసోడ్
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:

  • నరేషన్
  • పస లేని సన్నివేశాలు
  • నటీనటులు ప్రదర్శన

విశ్లేషణ:

నాట్యం చాలా సాదాసీదాగా రూపొందించబడిన డ్యాన్స్ ఆధారిత సినిమా. నాట్య ప్రదర్శన సన్నివేశాల వరకూ ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. కానీ అవి పక్కనపెడితే లాజిక్ కు అందని సన్నివేశాలతో విసిగిస్తుంది ఈ చిత్రం. చాలా తక్కువ పోజిటివ్స్ ఉన్న ఈ చిత్రాన్ని ఈజీగా స్కిప్ కొట్టేయొచ్చు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఎందుకు మాట్లాడకూడదు.?

న్యాయస్థానం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించి మాట్లాడకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.. అదీ వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీసీసీ...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ‘డాక్టర్’ రామ్ చరణ్ అయ్యారు. చెన్నైకి...

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...