Natti Kumar: పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్ టార్గెట్ చేయడంలో రాజకీయ కుట్ర కోణం దాగుందని.. ఆయనొక స్వార్ధపరుడని.. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడ’ని నిర్మాత నట్టి కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నో ఘటనలపై స్పందించని ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ట్వీట్ల యుద్ధం చేయడం చూస్తుంటే రాజకీయ కుట్రకోణం ఉందనిపిస్తోందని.. పవన్ కల్యాణ్ పేరుతో ప్రకాష్ రాజ్ దేవుడిని అవమానిస్తున్నాడు.
చిరంజీవిగారిని జగన్ అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు ప్రకాష్ రాజ్ ఎందుకు జగన్ పై ట్వీట్ చేయలేదు. కర్ణాటకకు చెందిన ప్రజ్వల్ రేవన్న, రజనీకాంత్ పై ట్రోల్ల్స్ రేణు దేశాయ్ పై ట్రోలింగ్, భువనేశ్వరిగారిపై అసభ్యంగా మాట్లాడినపుడు, చిరంజీవి తల్లి అంజనా దేవిగారిపై పోసాని అసభ్యంగా మాట్లాడినప్పుడు, ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో కేసీఆర్ నిలబెట్టినపుడు ఇండస్ట్రీ, ప్రకాష్ రాజ్ ఎక్కడున్నారు.. ట్వీట్లు ఎందుకు వేయలేదు. కేసీఆర్, జగన్ అంటే భయమా..? ప్రకాష్ రాజ్ రాజకీయంగా పవన్ కల్యాణ్ ను ఎదుర్కోవాలి కానీ.. ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాద’ని అన్నారు.
“సమంతపై మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడింది తప్పే ..అందుకు ఆవిడ క్షమాపణ చెప్పారు. నేషనల్ అవార్డ్ రావడం డాన్సర్స్ యూనియన్ కే గర్వకారణం. అతనికి జరిగిన అన్యాయం పై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలి. జానీ కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దు. జానీ విషయంలో సత్యమే గెలుస్తుంద’ని అన్నారు.
“తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు సాక్షాలతో ప్రెస్ మీట్ పెట్టారు. గత 5ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హాయంలో అన్యాయం జరిగిందనేది వాస్తవం. దర్శనం టికెట్లు బాహాటంగా బ్లాకులో అమ్ముకున్నారు. చంద్రబాబు ఇంకా వైసీపీవారిపై ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవటంలేద’ని అన్నారు.