టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్ తో విడిపోయినట్లు ప్రకటించాడు. గత కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. నటాషా తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పాండ్యా ఫోటోలు తొలగించడంతో ఈ వార్తలు మొదలయ్యాయి.
నటాషా తన కుమారుడు అగస్త్య ని తీసుకొని ముంబయి నుంచి సెర్బియా వెళ్తున్నట్లు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలో తమ నాలుగేళ్ల బంధానికి స్వస్తి పలికినట్లు ఈరోజు హార్దిక్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.
” నేను నటాషా చాలా ఆలోచించి పరస్పర అంగీకారంతో మా నాలుగేళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నాం. ఇద్దరం కలిసి ఉండటానికి చాలా ప్రయత్నించాం. కానీ విడిపోవాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఒకరినొకరు గౌరవించుకుంటూనే ఉంటాం. అగస్త్య మా ఇద్దరు సంరక్షణలోనే ఉంటాడు. ఈ కఠిన సమయంలో మా నిర్ణయాన్ని గౌరవిస్తూ మా స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉంటారని కోరుకుంటున్నా” అని పాండ్యా పోస్ట్ పెట్టాడు.