National Blood donation Day: ‘రక్తదానం’ విలువ చాటిచెప్పిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,219FansLike
57,764FollowersFollow

National Blood donation Day: అభిమానులను హీరోలు అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా, వారికో గౌరవం తీసుకొచ్చే బాధ్యత తీసుకున్న హీరో దేశంలో ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘చిరంజీవి’ మాత్రమే. జనరేషన్ మారిన తర్వాత కాకుండా.. తన ప్రైమ్ టైమ్ లోనే అభిమానులను బ్యానర్లు, కటౌట్లు కట్టడం కంటే సమాజ సేవ ముఖ్యమని మలచడం అత్యంత అరుదైన విషయం. హీరోల పేరు మీద సేవా కార్యక్రమాలు చేసే అభిమానులున్నారు కానీ.. హీరోనే అభిమానులను సేవా మార్గంలో పయనించేలా చేయడం.. అభిమానులూ తమ హీరో మాటే శిరోధార్యంలా భావించి.. దశాబ్దాలుగా సేవా మార్గంలో పయనించడం మరీ అరుదు. ఇవన్నీ సాధ్యమైంది మెగాభిమానులతో.. సుసాధ్యం చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఆ సేవా కార్యక్రమే ‘రక్తదానం’. నేడు ‘National Voluntary Blood Donation Day’.

ఓ దినపత్రికలో.. రక్తం అందక ఒక ప్రాణం పోయిందనే వార్త చిరంజీవిని కదిలించింది. దీంతో చిన్ననాటి నుంచి ఉన్న సేవా మార్గమే మెగాస్టార్ అయ్యాక కూడా కొనసాగింది. రేపటికి (అక్టోబర్ 2, 1998) 27ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్టు’ అలా ప్రారంభించిందే. రక్తం అందక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి ప్రారంభించిన ట్రస్టు ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. ‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి’ అని చిరంజీవి 1998లో ఇచ్చిన పిలుపు నేటికీ అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఫలితంగా లక్షలాది మంది అభిమానులు ఇన్నేళ్లలో రక్తదానం చేశారు. ఊరూ వాడా.. అభిమానులు చిరంజీవి పుట్టినరోజుకి సైతం బ్లడ్ బ్యాంకు స్థాపించి రక్తదానం చేయడం.. చేయించడం చేస్తూ రక్తం సేకరించి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అందేలా చేశారు.

నేటికి నిరంతరంగా కొనసాగుతున్న బ్లడ్ బ్యాంక్ ద్వారా 15లక్షలకు పైగా యూనిట్ల రక్తం సేకరించారు. చిరంజీవి సొంత నిధులతో రక్తం ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా అందేలా చేస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలోనే ఇన్నేళ్లలో దాదాపు 20లక్షల మందికి.. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలలో దాదాపు 15లక్షల మందికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందంచి ప్రాణాలు నిలిపింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి పిలుపుకి స్పందించి 50, 100సార్లు రక్తదానం చేసిన వారున్నారు. అత్యధికంగా రక్తదానం చేసిన వారికి చిరంజీవి ఇన్సూరెన్స్  పాలసీ చేయించారు. బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన వారికి చిరంజీవి. రామ్ చరణ్ సంతకం చేసిన సర్టిఫికెట్ తోపాటు ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. ఈ కార్డుతో ఏడాదిపాటు ఆపదలో ఉన్నవారికి ఇక్కడ నుంచి రక్తం అందించవచ్చు.

చిరంజీవి-పవన్ కల్యాణ్-రామ్ చరణ్ పుట్టినరోజున మెగాభిమానులు చేపట్టే రక్తదానంతో నిల్వ సామర్ధ్యానికి మించి వస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియా, నిమ్స్ తదితర ప్రభుత్వాసుపత్రులకు రక్త నిల్వవలను మళ్లిస్తున్నారు. అత్యధిక రక్తదాతలతో ప్రతి మూడు నెలలకు ఓసారి చిరంజీవి సమావేశమవుతున్నారు. ఎన్నోసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు’ వచ్చింది. తమిళనాడులో హీరో సూర్య చేసే సేవా కార్యక్రమాలకూ ఆదర్శమైంది. కుత్సిత మనస్తత్వంతో విమర్శలు చేసిన వారికి కోర్టు తీర్పులతోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గొప్పదనం తెలిసింది. నేటి జాతీయ రక్తదాతల దినోత్సవం.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 27ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ మహత్కార్యానికి వెన్నెముకగా నిలుస్తున్న చిరంజీవికి మనఃపూర్వక అభినందనలు తెలియజేయాల్సిందే.

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ టీజర్‌కు కౌంట్‌డౌన్

పాన్ ఇండియా చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టీజర్ విడుదలకు ఇక కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నాయని...

ఏపీకి రూ.7,707 కోట్ల కేటాయింపు.. ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌కు వికసిత్ భారత్–గారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (VB-G RAM G) కింద లభించిన భారీ నిధులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్–2047...

తన వెంట నడిచిన వారిని మరిచిపోని లోకేష్.. యువగళం బృందంతో ఆప్యాయ కలయిక

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో తనతో కలిసి నడిచిన కార్యకర్తలను గుర్తుపట్టడమే కాకుండా, వారిని పేరుపేరునా పలకరించి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో యువగళం...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్ కామెంట్

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల...

అల్లూరి, పింగళి, రోశయ్యకు లోకేష్ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం మూడు ప్రముఖ తెలుగు మహనీయులను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, భారత...