ఆ ఏజ్ ఏంటి.? ఆ గేజ్ ఏంటి.? అనాలనిపిస్తోంది చాలామందికి.! ఔను, సోషల్ మీడియా వేదికగా, సీనియర్ నటుడు నరేష్ గురించి జరుగుతున్న చర్చల్లో ఈ అంశమే ఎక్కువగా ప్రస్తావనకు వస్తోంది.
పెళ్ళీడుకొచ్చిన కొడుకుని పెట్టుకుని, అక్రమ సంబంధాలేంటి.? అని నెటిజనం నిలదీస్తోంది. ఇంతకీ, నరేష్ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.? అని అమాయకంగా కొందరు ప్రశ్నిస్తున్నారు.? ఎంతమంది.. అంటే లెక్క ఎలా చెప్పగలమని, నెటిజన్లు వెటకారంగా సమాధానమిస్తున్నారు.
స్టార్ కపుల్ మధ్య రచ్చ జరిగితే ఎలా వుంటుందో, అంతకన్నా బీభత్సంగా నడుస్తోంది సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం. సీనియర్ నటి పవిత్ర లోకేష్, సీనియర్ నటుడు నరేష్ మధ్య అక్రమ సంబంధం వుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అదిప్పుడు ముదిరి పాకాన పడింది.
సీన్‌లోకి నరేష్ భార్య రమ్య రఘుపతి వచ్చారు. తన భర్త మీద ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోపక్క, పవిత్ర లోకేష్ కారణంగా తమ కాపురంలో కలహాలు వచ్చాయనీ రమ్య రఘుపతి కంటతడి పెడుతున్నారు. అయితే, నరేష్ మాత్రం, పవిత్ర లోకేష్‌ని ఏమీ అనొద్దని అంటున్నాడు.
సీన్‌లోకి పవిత్ర లోకేష్ కూడా వచ్చింది. ‘నాకూ, నరేష్‌కీ మీరు మద్దతివ్వండి..’ అని మీడియా సాక్షిగా కోరుతున్నారామె. ఇదెక్కడి గొడవ.? రమ్య రఘుపతి, నరేష్.. ఈ ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి విడాకులు మంజూరు కాలేదు గనుక, మధ్యలో ఇంకో మహిళ రాకూడదు.
అబ్బే, పవిత్ర లోకేష్‌ని నరేష్ పెళ్ళి చేసుకోలేదు, సహజీవనం చేస్తున్నాడట.. అంటున్నారు కొందరు. ఇదెక్కడి పైత్యం.? అదీ ఈ వయసులో.? అంటూ నరేష్ మీద వెటకారాలు పడుతున్నాయి. ఎన్ని నీతులు చెప్పావయ్యా నరేషా, ‘మా’ ఎన్నికల సమయంలో.? ఇదా నీ పాడు బుద్ధి.? అని జనం ముక్కున లేవేసుకుంటున్నారు.
‘నాదేమీ తప్పు లేదు. నా భార్యదే తప్పు.. నా భార్యకీ, కారు డ్రైవరుకీ అక్రమ సంబంధం..’ అనే స్థాయికి నరేష్ దిగజారిపోయాడు. ఏం ఖర్మ పట్టింది తెలుగు జనాలకి, ఇలాంటి పైత్యపు కథ వినాల్సి వస్తోంది మరి.!