వారం రోజుల నుంచీ చర్చనీయాంశమైన సీనియర్ నటుడు నరేశ్ కుటుంబ వివాదం మరింతగా ముదురుతోంది. నటి పవిత్రా లోకేశ్ తో నరేశ్ సన్నిహితంగా ఉంటున్నారని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఇటివల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. నేడు వారిద్దరూ మైసూర్ లోని ఓ హోటల్లో బస చేస్తున్నారని తెలుసుకున్న రమ్య అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను ఎలా పెళ్లి చేసుకుంటారని గొడవ చేశారు. ఈక్రమంలో పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారు. మైసూర్ పోలీసులు రమ్యను అడ్డుకున్నారు.
పవిత్ర లోకేశ్ ను నరేశ్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటివల వైరల్ అయ్యాయి. వారిరువురూ మహాబలేశ్వరంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే.. పవిత్రతో స్నేహం ఉందని.. రమ్య చేస్తున్నవన్నీ ఆరోపణలేనని నరేశ్ కొట్టిపారేశారు. డబ్బు కోసం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఆమెకు ఇప్పటికే విడాకుల నోటీసులు పంపినట్టు నరేశ్ వెల్లడించారు.
47790 167832This really is wonderful content material. Youve loaded this with useful, informative content that any reader can realize. I enjoy reading articles that are so very well-written. 311902