Switch to English

హైద్రాబాద్ వేదికగా నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ నినాదం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

అసలు డబుల్ ఇంజిన్ అంటే ఏంటి.? దాని వల్ల ప్రయోజనమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. అయినాగానీ, డబుల్ ఇంజిన్.. అంటోంది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ప్రయోజనమనుకుంటే, మహారాష్ట్రలో అధికార పీఠమెక్కే అవకాశం వచ్చినా, ఎందుకు శివసేన అసమ్మతి ఎమ్మెల్యే, షిండేని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టినట్లు.?

రాజకీయం అంటేనే అంత.! ప్రధాని నరేంద్ర మోడీ హైద్రాబాద్ వేదికగా డబుల్ ఇంజిన్ సర్కారు.. అంటూ నినదించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ ఉవాచ. అంటే, కేంద్రంలోనూ అలాగే రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో వుండాలని అర్థం.

రేప్పొద్దున్న కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే.. అప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కారు.. అంటూ, బీజేపీ.. ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని వదులుకుంటుందా.? భారతదేశం రాష్ట్రాల కూటమి. ఔను, కేంద్రం అలాగే రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం వుండాలి. అంతే తప్ప, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం వుండకూడదు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, హైద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్ని ప్రస్తావించారు, తెలంగాణకి కేంద్రం ఏమేం చేసిందో చెప్పుకొచ్చారు. ఏమేం చేయబోతోందో వివరించారు. అంతా బాగానే వుందిగానీ, డబుల్ ఇంజిన్ సర్కారు.. అన్న మాటలోనే ఎక్కడో తేడా వుంది.

దేశంలో అసలంటూ ప్రాంతీయ పార్టీలే వుండకూడదన్నట్టుగా వుంది నరేంద్ర మోడీ ఆలోచన. ఎటూ కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయింది దాదాపుగా. సో, రాష్ట్రాల్లో అయినా.. కేంద్రంలో అయినా, బీజేపీ తప్ప ఇంకో పార్టీనే అధికారంలో వుండకూదనే ఆలోచనతో మోడీ వ్యవహరిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యం అనగలమా.? ఏమో, మోడీ ఏం చెబితే అదే నిజం.. ఇప్పుడున్న మీడియాకి కూడా. అదే మోడీ స్వామ్యం.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...