Switch to English

నేడే జాతినుద్దేశించి మోడీ ప్రసంగం.. ఈసారేం చెబుతారో.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ‘మీ ఇంటి ముందరే నిలబడి క్లాప్స్‌ కొట్టండి..’ అంటే, జనం తు.చ. తప్పకుండా పాటించారు. ‘మీ ఇంట్లో లైట్లు ఆపేసి కాస్సేపు కొవ్వొత్తుల్ని వెలిగించండి..’ అని మోడీ చెబితే, జనం పాటించారు. 135 కోట్ల మంది భారతీయులూ, కరోనా వైరస్‌ విషయంలో మోడీ చెప్పిన సూచనల మేరకు నడుచుకుంటున్నారన్నది నిర్వివాదాంశం.

ఇంత పెద్ద దేశంలో ఒకరిద్దరు చేసే తప్పులు జాతికి చేటు చేసే అవకాశం లేకపోలేదన్న విషయాన్ని పక్కన పెడితే, అత్యధిక శాతం మంది నరేంద్ర మోడీ చెప్పిన ప్రతి మాటనీ ఫాలో అవుతున్నారు. కానీ, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

‘లోన్లు, ఈవీఎంలపై మారటోరియం..’ విషయంలో కేంద్రం ఏదో చెప్పింది, బ్యాంకులు ఇంకోటేదో చేశాయి.. లాక్‌డౌన్‌తో జనం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే, బ్యాంకులు వడ్డీల మీద వడ్డీలతో చావగొట్టేస్తున్నాయి. మరోపక్క, కేంద్రం.. రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించడంలేదు.

ఇవన్నీ ఎత్తయితే, 135 కోట్ల మంది భారతీయులు ఓ పద్ధతి ప్రకారం లాక్‌డౌన్‌ సందర్భంలో జీవనం సాగిస్తోంటే, మళ్ళీ మద్యం మహమ్మారిని జనంలోకి బలవంతంగా వదలడమేంటి.? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆవేదనాభరితమైన అంశాలున్నాయి ప్రజల మెదళ్ళలో. అయితే, ప్రజల ఆవేదన గుర్తించే స్థితిలో నరేంద్ర మోడీ ఎప్పుడూ వుండరు. అసలు ప్రజల ఆకాంక్షలు ఆయనకి పట్టనే పట్టవు.. అనే విమర్శ లేకపోలేదు.

పబ్లిసిటీ స్టంట్లు తప్ప, నరేంద్ర మోడీ చేసిందేంటి.? క్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ ప్రజలతో ‘పబ్లిసిటీ ఆటలు ఆడతారా.?’ అన్న విమర్శలకు నరేంద్ర మోడీ ఏం సమాధానం చెబుతారు.? ముచ్చటగా మూడోసారి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నాలుగో పొడిగింపు తప్పదా.? లాక్‌డౌన్‌ అంటూనే, సడలింపుల పేర్లతో మద్యం అమ్మకాలకు ఆస్కారమిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ, దేశ ప్రజలకు ఏం సంకేతాలు పంపినట్లు.?

దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ, లాక్‌డౌన్‌పై కేంద్రం తీసుకోబోయే నిర్ణయం, 135 కోట్ల మంది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.? ఏదిఏమైనా, జాతిని ఉద్దేశించి మోడీ చేసే ప్రసంగం, దేశ ప్రజలకు భరోసా ఇచ్చేలా వుండాలని ఆశిద్దాం.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ఆ విషయంలో చంద్రబాబుని మించిపోయిన వైఎస్‌ జగన్‌.!

అధికారంలో ఎవరున్నా భజన కార్యక్రమాలు తప్పవు. విద్యార్థులతోనూ, సాధారణ ప్రజలతోనూ.. పొగిడించుకోవడం పాలకులకు అలవాటే. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ, చంద్రబాబు హయాంలోనూ ఇలాంటివి చాలానే చూశాం. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ చూస్తున్నాం. ఓ...

ఇన్ సైడ్ స్టోరీ: కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక మరణం వెనుక గల కారణాలు.?

గత రాత్రి(మే 28న) ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చిన్నకుమారుడు ఫణింద్ర భార్య సుహారిక అనుమానాస్పదంగా మరణించిందని తెలిపాము. ఈ సుహారిక మరణం గురించి పలు అనుమానులు వెల్లువెత్తుతున్నాయి. మేము ఇన్...

‘సమంత’ ఏమంత అందగత్తె కాదు.. బుట్టబొమ్మకు షాకిచ్చిన హ్యాకర్లు

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో మరలా ఆ అకౌంట్ ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

ఓటిటి రిలీజ్: జ్యోతిక ‘పొన్మగళ్ వందాల్’ తమిళ్ మూవీ రివ్యూ

నటీనటులు: జ్యోతిక, భాగ్యరాజ్, పార్తీబన్ నిర్మాత: సూర్య దర్శకత్వం: జేజే ఫెడ్రిక్ రన్ టైం: 2 గంటల 3 నిముషాలు విడుదల తేదీ: మే 29, 2020 ఓటిటి ప్లాట్ ఫామ్: అమెజాన్ ప్రైమ్ తమిళ నటి జ్యోతిక నటించిన కొత్త...