దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రధాని నరేంద్ర మోడీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ తన జన్మ భూమి అయితే, కాశీ తనకు కర్మ భూమి అని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ చెబుతుంటారు.
అదే బాటలో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీకి సంబంధించినంతవరకు తనకు జన్మ భూమి తెలంగాణ అయితే, కర్మ భూమి ఆంధ్ర ప్రదేశ్.. అని చెబుతుంటారు. తాజాగా, జనసేన పార్టీ ఆవిర్భవించి 11 ఏళ్ళు పూర్తి చేసుకుని, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న దరిమిలా ఏర్పాటు చేసుకున్న ‘జయకేతనం’ బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ ‘జన్మ భూమి – కర్మ భూమి’ అంటూ చెప్పుకొచ్చారు.
మరో వైపు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుజరాత్ జన్మ భూమి – కాశీ కర్మ భూమి.. అంటూ వ్యాఖ్యానించారు. ఇటు పవన్ కళ్యాణ్, అటు నరేంద్ర మోడీ.. జన్మ భూమి అలాగే కర్మ భూమి గురించి మాట్లాడిన వ్యాఖ్యల్ని జత చేసి, ఓ వీడియోను తయారు చేసి, దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఇరువురి అభిమానులు.
2014 నుంచి జనసేన – బీజేపీ రాజకీయంగా కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా, రెండు పార్టీల మధ్య స్నేహం మాత్రం అంతే బలంగా వుంది. ఇటీవలి కాలంలో ‘యే పవన్ నహీ.. ఆంధీ హై..’ అంటూ పవన్ కళ్యాణ్‌ని కొనియాడుతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని, దక్షిణాది రాజకీయాల్లో బీజేపీ తన ట్రంప్ కార్డ్‌లా భావిస్తోంది. ఉత్తరాది రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఇమేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది.
జనసేన ఆవిర్భావం 2014 ఎన్నికల సమయంలో తెలంగాణలో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ అలాగే 2 ఎంపీ సీట్లని గెలుచుకుంది జనసేన.. అదీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో.
కర్మ భూమి ఆంధ్ర ప్రదేశ్ నుంచి చట్ట సభలకు ఎన్నికైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జన సేన జన్మ భూమి అయిన తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు.
जैसा गुरु,
वैसा शिष्य 🙏 pic.twitter.com/zsVBfMRYWK
— Kreately.in (@KreatelyMedia) March 20, 2025