సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఏపీ బ్రాండ్ మళ్లీ తిరిగి వచ్చిందన్నారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడపై ఉన్న నమ్మకంతోనే ఏపీకి చాలా కంపెనీలు తిరిగి వస్తుననాయన్నారు. విజయవాడ సమీపంలోని మల్లపల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంటును మంత్రి లోకేష్ ప్రారంభించారు. ప్లాంటు ఆవరణలో మొక్కులు నాటారు. ఆ తర్వాత తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎం ఎస్ ఆర్టీసి బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అశోక్ లే లాండ్ బస్సు తయారీ కంపెనీ ఏపీలో ఉండటం తనకు సంతోషంగా ఉందన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మళ్లీ అశోక్ లే లాండ్ కంపెనీని తీసుకువచ్చానన్నారు.
తమ మీద ఉనన నమ్మకంతోనే కంపెనీ ఇక్కడకు వచ్చిందని.. వారిని కాపాడుకుంటామన్నారు. ‘నేను గతంలో ఓ ఛానెల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు.. తెలంగాణకు హైదరాబాద్, తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగుళూరు ఉంది.. మరి ఏపీకి ఏం ఉందని ప్రశ్నించారు. మాకు చంద్రబాబు నాయుడు ఉన్నాడని చెప్పాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పేరే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్లే కంపెనీలు ఏపికి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకు టెక్నాలజీని ఎలా పెంచాలో తెలుసు. ఏపీ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఎంత చేయాలో అంత చేస్తున్నాం’ అని చెప్పానన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని.. ఆ హామీ కోసమే ఇప్పుడు కంపెనీలను తీసుకువస్తున్నట్టు తెలిపారు.
ఏపీని పెట్టుబడి హబ్ గా మార్చేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని.. తమను నమ్మి ఏపీలో కంపెనీ ప్రారంభించినందుకు అశోక్ లే లాండ్ కు థాంక్స్ చెప్పారు లోకేష్. గత ప్రభుత్వ అరాచకాలు తట్టుకోలేక చాలా కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోయాయని.. అమరరాజా, లులు లాంటి పెద్ద కంపెనీలే పారిపోయేలా చేసిన ఘనత జగన్ దే అని విమర్శలు గుప్పించారు. మల్లవల్లిలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తే.. జగన్ దాన్ని సర్వ నాశనం చేశాడని మంత్రి ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 450 కంపెనీలు ఏపీకి తెస్తే.. అందులో చాలా కంపెనీలు వైసీపీ హయాంలో వెళ్లిపోయాయన్నారు.
దాంతో ఏపీకి ఆదాయం, అభవృద్ధి రెండు తగ్గిపోయాయ్నారు. అశోక్ లేలాండ్ కు కేటాయించిన 75 ఎకరాల్లో 40 ఎకరాల్లో ప్లాంటును అభివృద్ధి చేశారన్నారు. ఈ ప్లాంట్ ఏటా 4,800 బస్సులను ఉత్పత్తి చేస్తుందని.. దాని వల్ల ఏపీ యువతకు మొదటిదశలో 600 ఉద్యోగాలు, రెండో దశలో 1,200 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.