ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడి కుమారుడు, హీరో నారా రోహిత్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయన చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎన్నో సినిమాలు చేశాడు కానీ.. ఎందుకో స్టార్ డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు. పైగా ఈ నడుమ ఆయన నుంచి సినిమాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఇక అటు ఏపీలో చంద్రబాబు సీఎం కావడంతో నారా రోహిత్ కు ఇండస్ట్రీలో మంచి రోజులు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. నారా రోహిత్ కు వయసు కూడా మీద పడుతోంది.
ఆయనకు ఓ అన్న కూడా ఉన్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. కానీ రోహిత్ మాత్రం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక నారా భువనేశ్వరి ఈ సంబంధం కుదిర్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 13న హైదరాబాద్ లో ఈ ఎంగేజ్ మెంట్ ఉండబోతోంది. ఈవేడుకకు సీఎం చంద్రబాబుతో పాటు బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా హాజరుకాబోతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు వస్తారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రీసెంట్ గా యంగ్ హీరోలు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.
ఇప్పుడు రోహిత్ కూడా ఈ బాటలో చేరిపోయాడు. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా రోహిత్ ఉంటున్నాడు. రోహిత్ వాళ్ల నాన్న కూడా కళాకారుడే. ఆ ప్రభావం నారా రోహిత్ మీద పడి ఆయన సినిమాల్లోకి వచ్చాడు. చంద్రబాబు వల్లే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఎన్నోసార్లు రోహిత్ చెప్పుకొచ్చారు.