పెనికలపాడులో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,216FansLike
57,764FollowersFollow

రైతులను సేంద్రియ సాగువైపు మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులోని రైతు మునగాల ద్వారకానాథ రెడ్డి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు.

సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న వివిధ పంటలను మంత్రి పరిశీలించారు. ద్వారకానాథ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడానికి గల కారణాలు, ఎదురైన సవాళ్లు, ప్రస్తుతం లభిస్తున్న ఆదాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లుగా తమ ఉమ్మడి కుటుంబానికి చెందిన 17 ఎకరాల్లో సమీకృత సేంద్రియ సాగు చేస్తున్నట్లు రైతు కుటుంబం వివరించింది.

మామిడి, బత్తాయి, ఉసిరి, కొబ్బరి, జామ, నేరేడు, మునగ, రామాఫలం, సీతాఫలం వంటి పంటలతో పాటు నాటుకోళ్ల పెంపకం, చేపల సాగు, పశుపోషణను అనుసంధానం చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నామని రైతులు తెలిపారు. తమ పొలంలోనే సహజ ఎరువులు తయారు చేసుకుంటున్నామని, ప్రస్తుతం రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం లేకుండా సాగు చేస్తున్నామని చెప్పారు.

ప్రకృతి వ్యవసాయం వల్ల భూసారం కాపాడటంతో పాటు రైతు పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ సాగును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాయలసీమలో బిందు సేద్యానికి, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్థానిక రైతులను సేంద్రియ సాగు వైపు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన మామిడిని మంత్రి లోకేష్ రుచి చూశారు. అనంతరం ద్వారకానాథ రెడ్డి కుటుంబ సభ్యులు మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. సమీకృత సేంద్రియ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతు కుటుంబాన్ని మంత్రి అభినందించి, ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

సినిమా

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా...

‘లెనిన్’కు థమన్ ఫినిషింగ్ టచ్.. నేటి నుంచి థమన్ ప్రమోషన్ రౌండ్!

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చివరి దశ సంగీత పనులను సంగీత దర్శకుడు ఎస్....

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

రాజకీయం

విశాఖలో ఎల్‌జీ జీసీసీకి లోకేష్ ఆహ్వానం.. శ్రీసిటీలో పెట్టుబడుల విస్తరణపై చర్చ

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ఎల్‌జీ...

ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్ హబ్‌కు లోకేష్ ఆహ్వానం..

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్స్, అధునాతన ఆటోమోటివ్ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహ రాశికి ఆర్థిక లాభం.. మీన రాశికి శుభవార్త

జులై 4, 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చంద్ర మాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులను పరిశీలించి సిద్ధం చేసిన రాశి ఫలాలు ఇవి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం,...

తిరుమలలో పవన్ కళ్యాణ్.. స్వామివారి దర్శనం తర్వాత పెళ్లి వేడుకలో పాల్గొన్నారు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో వీబీజీ–రామ్‌జీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసిన అనంతరం నేరుగా తిరుమలకు...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...

కడపలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శ్రీకారం.. రాయలసీమకు భారీ పెట్టుబడుల బూస్ట్

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుడుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో ఏర్పాటు కానున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్...

కోదాడలో గ్యాస్ పేలుడు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం గ్యాస్ పేలుడు సంభవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగా థియేటర్ సమీపంలోని సందులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు...