వికసిత్ భారత్‌కు నైపుణ్యమే బలం.. ఏపీని టాలెంట్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,223FansLike
57,764FollowersFollow

విశాఖపట్నంలో నిర్వహించిన డీజీ 100ఎక్స్ ఏపీ (Digii100x Andhra Pradesh) సదస్సులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, నైపుణ్యం కలిగిన మానవ వనరులే భవిష్యత్ పోటీ ప్రపంచంలో దేశం, రాష్ట్రాలను ముందంజలో నిలబెడతాయని అన్నారు. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడులు పెట్టడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ప్రపంచం వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), ఆధునిక సాంకేతికతల ప్రభావంతో ఉద్యోగాల స్వరూపం మారిపోతోందని లోకేష్ తెలిపారు. భూమి, సహజ వనరులు లేదా మూలధనం కంటే ప్రతిభే ఒక రాష్ట్రానికి నిజమైన బలమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో దశాబ్దాలుగా దేశానికి, ప్రపంచానికి అత్యుత్తమ మానవ వనరులను అందిస్తోందని గుర్తు చేశారు. సిలికాన్ వ్యాలీ నుంచి సింగపూర్ వరకు, లండన్ నుంచి దుబాయ్ వరకు ప్రపంచవ్యాప్తంగా తెలుగు నిపుణులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.

విద్యాశాఖ బాధ్యతలను తాను ప్రత్యేకంగా కోరుకుని తీసుకున్నానని లోకేష్ వెల్లడించారు. విద్య అనేది కేవలం డిగ్రీలు అందించే వ్యవస్థ మాత్రమే కాదని, తదుపరి తరం నాయకులను తయారు చేసే శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం విద్య ద్వారానే లభిస్తుందని అన్నారు.

రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి చెప్పారు. మరో రెండు వారాల్లో స్కిల్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను నిన్నటి ఉద్యోగాల కోసం కాకుండా, రేపటి అవకాశాల కోసం సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఏఐ, ఎలక్ట్రానిక్స్ తయారీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని వివరించారు.

ఏఐ ఉద్యోగాలను తగ్గించదని, కొత్త అవకాశాలను సృష్టిస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రతి పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలకు దారితీసినట్లే, ఏఐ కూడా భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. ఏఐ ఆధారిత విద్య, పరిశోధన, పాలన, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్రాండ్ సీబీఎన్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ ప్రత్యేకతలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. గూగుల్ భారతదేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టేందుకు ముందుకు వచ్చిందని, ఆర్సెలార్ మిట్టల్, ఫైటర్ జెట్ తయారీ వంటి కీలక ప్రాజెక్టులు కూడా రాష్ట్రంలోకి వచ్చాయని వెల్లడించారు.

దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని లోకేష్ తెలిపారు. గాజు తయారీ, డ్రోన్లు, సిమెంట్, ఉక్కు, ఆటోమొబైల్, ద్విచక్ర వాహనాలు, బయోగ్యాస్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా రాష్ట్రంలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని వెల్లడించారు.

యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 22 పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, ఆటోమోటివ్ రంగాల్లో ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. విద్య, ఆర్థికాభివృద్ధి పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, ఈ రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

విద్యార్థులు ఓటమికి భయపడవద్దని లోకేష్ సూచించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఓడిపోయినా, దానిని పాఠంగా తీసుకుని కష్టపడి పనిచేసి తిరిగి విజయం సాధించానని గుర్తు చేశారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు, సూచనలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

కుప్పం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు.. ‘జన నాయకుడు’ పోర్టల్‌పై ప్రత్యేక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన జన నాయకుడు పోర్టల్ పనితీరును ఆయన పరిశీలించారు. పోర్టల్...

వంగవీటి రంగా జయంతి.. ఘన నివాళులు అర్పించిన ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్

కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు. బాలాజీ నగర్, ప్రగతి నగర్, ఎల్లమ్మ బండ, కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డ్...

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

అల్లూరి ఆశయాలే దేశానికి స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో అల్లూరి...

ఎక్కువ చదివినవి

యూట్యూబర్ ప్రశ్న రావణ్ వరుస అరెస్టులు.. మూడు రోజుల్లో నాలుగు సార్లు అదుపులోకి

యూట్యూబర్ బాచలకూరి జోసెఫ్ అలియాస్ "ప్రశ్న" రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు జూన్ 30 నుంచి జూలై 4 మధ్య మూడు రోజుల వ్యవధిలో నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేశారు. ప్రతి కేసులో...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు ప్లాన్

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో...

మంత్రి లోకేష్ తిరుమల పర్యటన.. వరుసగా మూడు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజీగా గడిపారు. ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం...

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్..! అఖిల్ కష్టంపై నాగ చైతన్య స్పందన

Lenin: అక్కినేని ఇంటి మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇప్పటికే తెరంగేట్రం చేసిన అఖిల్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరోగా...

జులై 15 నుంచి ఇంటింటికీ కూటమి విజయాలు.. టీడీపీ కేడర్‌కు లోకేష్ దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, ఈ రోజు తాము పదవుల్లో ఉండటానికి పార్టీ కేడర్ చెమట, త్యాగాలే కారణమని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అన్నారు. శ్రీకాళహస్తి...