విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు చేపట్టారు. ఇందులో చూసుకుంటే 9, 10 తరగతి స్టూడెంట్లకు ఏఐ తో పాటు కోడింగ్ లాంటి వాటిపై ప్రత్యేక కోర్సులు అందించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను కూడా రెడీ చేశారు. విద్యార్థులకు టెక్నాలజీపై పట్టు పెంచుతూనే లింగ సమానత్వం గురించి కూడా క్లాసులు చెప్పించబోతున్నారు.
ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం లాంటి అంశాల మీద అవగాహన కల్పించబోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తారు. అంటే ఆ రోజు పుస్తకాల సంచులు, బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. దాంతో పాటు తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఆ వెంటనే టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బ్రిడ్జి కోర్సులను స్టార్ట్ చేస్తారు. నవంబర్ నెల వచ్చే నాటికి సిలబస్ ను పూర్తి చేసి డిసెంబరు 5 నుంచి వంద యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు.
ప్రీ ఫైనల్ ఫిబ్రవరి 9 నుంచి 19 దాకా గ్రాండ్ టెస్ట్ మార్చి 2 నుంచి 12వ తేదీ దాకా నిర్వహిస్తారు. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటాయి. ఆ లోపు విద్యార్థులకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన రావడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. వీరితో పాటు అన్ని తరగతుల్లో వెనకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెడుతారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో హైబ్రిడ్ లెర్నింగ్ నిర్వహిస్తారు. ఫార్మాటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంగ్లిష్ భాష స్కిల్స్ ను కూడా పెంపొందిస్తారు. దీని కోసం మిషన్ ఇంగ్లిష్ ఫ్లూయన్సీ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇవే కాకుండా స్టూడెంట్స్ కు అవసరమైన APPSC, UPSC, బ్యాంకింగ్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద స్పెషల్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించి వారికి అవగాహనతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇటు చదువును బిల్డ్ చేస్తూనే అటు హెల్త్ పై శ్రద్ధ తీసుకుంటారు. మెంటల్ హెల్త్ తో పాటు ఫిజికల్ హెల్త్ కు సంబంధించిన స్పెషల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ మంత్రి నారా లోకేష్ చొరవతోనే జరుగుతున్నాయంటున్నారు. ఆయన స్పెషల్ గా స్టూడెంట్స్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వారికి ఏమేం కావాలనేది ఈ షెడ్యూల్ లో పొందుపరిచారు.