Switch to English

క్లాస్ మేట్స్ వర్సెస్ జైల్ మేట్స్.. అర్థమయ్యిందా రాజా: జగన్‌కి లోకేష్ షాక్ ట్రీట్మెంట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,117FansLike
57,764FollowersFollow

సోషల్ మీడియా వేదికగా, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ‘అర్థమయ్యిందా రాజా’ అంటూ నారా లోకేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందంటూ, కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా. సాక్షి ఛానల్‌లో అమరావతి మహిళలపై నడిచిన జుగుప్సాకరమైన వ్యాఖ్యల ప్రసహనం, ఈ క్రమంలో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ తెలిసిన విషయాలే.

తమ ఉద్యోగినే అరెస్టు చేస్తారా.? అంటూ, వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది.. జరిగిన ‘నేరాన్ని’ కప్పిపుచ్చుతూ. రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ అక్కసు ఈనాటిది కాదు. గతంలోనూ వైసీపీ నేతలు అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు అమరావతిపైన.

ఇక, జగన్ తన ట్వీటులో నారా లోకేష్‌కి సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేశారు. నారా లోకేష్ మీద కుట్ర పూరితంగా కొందరు నెటిజన్లు తయారు చేసిన వీడియో అది. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్, ఆ వీడియోని తాను పోస్ట్ చేయడం సబబు కాదని తెలుసుకోలేకపోయారు.

ఇక, ఈ వ్యవహారంపై నారా లోకేష్ మండిపడ్డారు ట్విట్టర్ వేదికగా. ‘నాకు క్లాస్ మేట్స్ వుంటారు.. నీకు జైల్ మేట్స్ వుంటారు. మహిళల్ని గౌరవిస్తూ నేను పెరిగాను.. తల్లినీ, చెల్లినీ ఇంట్లోంచి గెంటేసి, వారిని కోర్టుకు లాగావు నువ్వు..’ అంటూ లోకేష్ తన ట్వీటులో పేర్కొన్నారు.

‘నీ ఐదేళ్ళ చీకటి పాలనలో దళితులపైనా, మహిళలపైనా అనేక అఘాయిత్యాలు జరిగాయి.. రాజకీయ ప్రత్యర్థులపై కుట్రపూరితంగా కేసులు పెట్టి, జైలుకు పంపించిన ఘనత నీది..’ అంటూ లోకేష్ ట్వీటాస్త్రం సంధించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీటుని కోట్ చేస్తూ నారా లోకేష్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘క్లాస్ మేట్స్ – జైల్ మేట్స్’, ‘అర్థమయ్యిందా రాజా’ తదితర డైలాగులు ట్రెండ్ అవుతున్నాయి.

సినిమా

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

పండగ సందడిలో నవ్వుల రాజు.. సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ హంగామా

మూడు వరుస ఘన విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి, ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో థియేటర్లకు రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్...

Daily Horoscope: ఆర్థిక లాభ సూచనలు మేషం వారికి, ఉద్యోగంలో పురోగతి కన్య వారికి

జనవరి 8, 2026 గురువారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు చంద్రమాన ప్రభావంతో ఆర్థిక విషయాల్లో సానుకూలత ఉంటుంది. అనుకోని ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. కుటుంబ...

TOLLYWOOD: అన్నీ ఫ్యామిలీ సినిమాలే.. సంక్రాంతికి పెద్ద ఫైటే..

TOLLYWOOD: ‘సంక్రాంతి వస్తోంది.. సందళ్లు తెస్తోంది’ నాటి మాట. ‘సంక్రాంతి వస్తోంది.. సినిమాలు తెస్తోంది’ అనేది నేటి మాట. ఇది నిజమే మరి. సంక్రాంతి అంటే.. భోగి భాగ్యాలు, ముగ్గులు, పల్లెల్లో వేడుకలు,...

సంక్రాంతి బిగ్గీస్ టికెట్ ధరలు: నైజాం మార్కెట్‌లో హై వోల్టేజ్ చర్చ

సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతున్న భారీ చిత్రాల టికెట్ ధరలు నైజాం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటించిన #TheRajaSaab మరియు చిరంజీవి చిత్రంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న #ManaShankaraVaraPrasadGaru సినిమాల టికెట్...

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...