ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దుతాం: నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,034FansLike
57,764FollowersFollow

విశాఖపట్నం: చారిత్రక వారసత్వం కలిగిన Andhra Universityకి పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అధికారులకు ఆదేశించారు. విశాఖలో యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ సహా ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆంధ్ర యూనివర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాలు యూనివర్సిటీని ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దే వేదిక కావాలని అన్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు జరిగే కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. యూనివర్సిటీ చరిత్ర, విజయాలను ప్రతిబింబించేలా ఉత్సవాలను ప్రణాళిక చేయాలని అధికారులను ఆదేశించారు.

కమిటీల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని, మీడియా ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులను శతాబ్ది వేడుకల్లో భాగస్వాములను చేయాలని, ప్రముఖులతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని సూచించారు. యూనివర్సిటీ వందేళ్ల విజన్‌కు అనుగుణంగా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు.

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేపట్టబోయే అభివృద్ధి పనులు, ఏప్రిల్ 26న నిర్వహించనున్న స్థాపన దినోత్సవ అజెండాను వీసీ వివరించారు. అనుబంధ కళాశాలలను కూడా ఉత్సవాల్లో భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు శతాబ్ది ఉత్సవాలను విశాఖపట్నం, ఉత్తరాంధ్రకు గుర్తింపు తీసుకువచ్చేలా నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్ నాయుడు, విష్ణుకుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.

సినిమా

Venu Udugula: ‘కుటుంబ పరువు ఏమైపోవాలి..’ మంగ్లీ కేసుపై దర్శకుడు వేణు...

Venu Udugula: ప్రముఖ సినీ గాయకురాలు మంగ్లీపై వచ్చిన ఆర్ధిక లావాదేవీల ఆరోపణలు చిత్రసీమలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంలో సంబంధం...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం....

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక...

Anudeep: అనుదీప్ పై ఆగ్రహజ్వాలలు.. రంగంలోకి రామ్ చరణ్ ఫ్యాన్స్, జనసేన...

Anudeep: మారుతున్న కాలాన్ని బట్టి కామెడీ పద్దతులు కూడా మారిపోతున్నాయి. సున్నిత హాస్యంతో ప్రజల్ని నవ్వించే రోజుల నుంచి ఎదుటి వ్యక్తుల్ని వ్యక్తిత్వహననం చేస్తూనో, వారి...

రాజకీయం

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

వైఎస్‌ డెత్ మిస్టరీ మళ్లీ హాట్ టాపిక్..! బాణం జగన్ వైపేనా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ ఈ ఘటనను గత 15 ఏళ్లుగా రాజకీయంగా వాడుకున్న తీరు ఇప్పుడు తిరిగి అదే...

పులివెందులకు గుడ్ బై.? ‘మావిగన్’ నుంచి పోటీ చేయనున్న జగన్.?

రాయలసీమపై వైఎస్సార్సీపీ ఆశలు వదిలేసుకుందా.? పులివెందుల నుంచి వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పోటీ చేయడంలేదా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘మావిగన్’ నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నారా.? ‘మావిగన్’...

ఎక్కువ చదివినవి

అమరావతిపై కేంద్రం స్పీడ్.. వైసీపీకి ఢిల్లీ సిగ్నల్స్ మిస్ అయ్యాయా?

అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెలువడిన...

మూడు రోజుల వర్ష హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాలకు పిడుగు అలర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు, రేపు మరియు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో...

87వ రోజు ప్రజాదర్బార్‌లో లోకేష్‌కు వినతుల వెల్లువ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మరోసారి ప్రజా సమస్యలకు వేదికైంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 87వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగ సంఘాల...

2029లో వైసీపీకి టఫ్ ఫైట్.. ఉండవల్లి కీలక విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికలపై చర్చలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్న వేళ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా వైసీపీ భవిష్యత్తు, కూటమి రాజకీయాలు,...

పేరు పైత్యమా! అమరావతికి ‘మావిగన్’ పేరు పెడితే, వైఎస్ జగన్‌కి ఓకేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రతిపాదించారు. అంతకు ముందు చంద్రబాబు...