ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విషయంలో వైసీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందని నారా లోకేష్ అన్నారు. వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు. విద్యారంగంపై శాసనమండలిలో చర్చ జరిగితే వైసీపీ సభ్యులు ఎందుకు బయటకు వెళ్లారని అన్నారు. ఈ విషయాలన్నీ ఆరోజే చెప్పామని అన్నారు లోకేష్.
ఆరోజు చర్చలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చాలా స్పష్టంగా చెప్పాం. మీరెందుకు బాయ్ కాట్ చేశారరు. వినకుండా, చవకుండా మళ్లీ ఆరోపణలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. మంత్రి బాలవీరాంజనేయ స్వామి వాస్తవాలు చెబుతుంటే దానిని ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు.
వైసీపీ హయాంలో 4,200 కోట్ల రూ. బకాయిలు పెట్టారు.. అది నిజం కాదో చెప్పాలి.. వివరాలు పంపిస్తామని అన్నారు లోకేష్. స్కూల్ ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్ వివరాలన్నీ ఉన్నాయని అన్నారు. 2019 లో ప్రభుత్వం పెట్టిన బకాయిలను 16 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. కూటమి వచ్చి 10 నెలలే అవుతుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం.. హౌస్ సాక్షిగా హామీ ఇచ్చానని అన్నారు నారా లోకేష్. వైసీపీ చర్చల్లో పాల్గొనకుండా మళ్లీ వాటి గురించి ప్రస్తావించడంపై లోకేష్ ఫైర్ అయ్యారు.