సంక్రాంతి పండగ సందర్భంగా నారా కుటుంబం నారావారిపల్లెలో సందడి చేస్తోంది. ప్రతి ఏటా సంక్రాంతిని సొంతూర్లో కుటుంబ సమేతంగా జరుపుకుంటారు సీఎం చంద్రబాబునాయుడు. ఈసారి కూడా కుటుంబమంతా కలిసి పల్లెలో పండగ జరుపుకున్నారు. పండగ సందర్భంగా భార్య బ్రాహ్మణికి మంత్రి నారా లోకేశ్ మంగళగిరి చేనేత చీర బహుబతిగా ఇచ్చారు.
మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు లోకేశ్. స్థానికంగా తయారు చేసే మంగళగిరి చేనేతలంటే ఆయనకు ఎంతో ప్రేమని.. అవకాశమున్నచోట ప్రమోట్ చేస్తూ చేనేతల ఆత్మ బంధువుగా లోకేశ్ వ్యవహరిస్తూంటారని అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా భార్యకు మంగళగిరి చేనేత చీరను సంక్రాంతి సందర్భంగా బహుకరించడమే.
భర్త ఇచ్చిన మంగళగిరి చీర కట్టుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బ్రాహ్మణి. దీంతో నారా కుటుంబమే మంగళగిరి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని చెప్పాలి. దీంతో లోకేశ్ ఎక్కడున్నా ఆయన మనసంతా మంగళగిరిపైనే అంటూ.. తమపై ఆయన కుటుంబం చూపుతున్న అభిమానానికి మంగళగిరి చేనేతలు మురిసిపోతున్నారు.