ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయం పట్ల కొంత సీరియస్ గానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం(డి) పెంట జడ్పీహెచ్ ఎస్ హెచ్ ఎం రమణ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. తాము అన్ని విధాలుగా విద్యా బుద్ధులు నేర్పిస్తున్నామని, అన్ని వసతులు కల్పిస్తున్నా సరే స్టూడెంట్లలో మార్పులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రౌండ్ లో స్టూడెంట్స్ ను నిలబెట్టి తన ఆవేదన వెలిబుచ్చారు. ‘మీ కోసం మేం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. కానీ మీలో నేర్చుకోవాలనే తపన రావట్లేదు. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ లాంటివి రావట్లేదు. ఇంక మేమేం చేయాలి. మా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి’ అంటూ గుంజీలు తీశారు. నేలపై పడుకుని క్షమించమని కోరారు. దీంతో విద్యార్థులంతా సార్ వద్దు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. హెచ్ ఎం రమణను అభినందించారు.
‘రమణ గారు మీరు చేసిన పని నా మనసును కదిలించింది. విద్యార్థుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు మనం ఇలాంటి సున్నితమైన విధానాలను ఎంచుకోవచ్చు. మనమందరం కలిసి స్టూడెంట్లలో మార్పును తీసుకొద్దాం. గవర్నమెంట్ స్కూల్స్ ను ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదాం’ అంటూ రాసుకొచ్చారు. లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్టూడెంట్లను కొట్టడం, బెదిరించడం ద్వారా మార్పు సాధించలేమని.. వారిని మన దారిలోకి తీసుకువచ్చి మార్చుకోవాలనేది మంత్రి లోకేష్ ఉద్దేశంగా కనపడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.
అదే సమయంలో స్టూడెంట్ల కోసం అంతగా ఆరాటపడుతున్న ఆ హెచ్ ఎంను కూడా అభినందిస్తున్నారు నెటిజన్లు. ఏపీలో గవర్నమెంట్ స్టూడెంట్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది. నాణ్యమైన ఆహారం, బట్టలు, విద్య అందించడమే లక్ష్యంగా భారీగా నిధులు కూడా కేటాయించింది.
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ!… pic.twitter.com/Se7zu6uwf5
— Lokesh Nara (@naralokesh) March 13, 2025