Switch to English

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,172FansLike
57,764FollowersFollow

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మలిచారు. ఈ సందర్భంగా నారావారిపల్లెలోని నివాసంలో టీటీడీ వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
అనంతరం గ్రామదేవత దొడ్డి గంగమ్మ, కులదేవత నాగాలమ్మ దేవాలయాలను సందర్శించిన మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయాల్లో ప్రార్థనలు చేశారు. పండుగ రోజున గ్రామ ప్రజలతో కలసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

తదుపరి తాతయ్య ఖర్జూరపునాయుడు, నాయనమ్మ అమ్మణమ్మ, బాబాయి నారా రామ్మూర్తినాయుడు సమాధుల వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. కుటుంబ వారసత్వం, విలువలను స్మరించుకుంటూ పెద్దలకు ఘనంగా గౌరవం తెలియజేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్, బసవతారకమ్మ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలపై వారి కృషిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారావారిపల్లెలో జరిగిన ఈ సంక్రాంతి వేడుకలు సంప్రదాయం, కుటుంబ అనుబంధం, ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సినిమా

విజయ్–రష్మిక పెళ్లి వివరాలు లీక్? కుటుంబాలకు తలనొప్పి

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో లీక్ అవుతుండటం కలకలం రేపుతోంది. పెళ్లి తేదీ, వేదిక,...

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ వైరల్..! ఎవరిని ఉద్దేశించి ఆ...

Dil Raju: ‘నేటి రోజుల్లో నిర్మాతకు విలువలేద’ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఎవరిని ఉద్దేశించి ఆయన...

మే 1న పిల్లల కోసం ‘సమ్మర్ హాలిడేస్’.. థియేటర్లలోకి రాబోతున్న కొత్త...

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ధీరజ్ మొగిలినేని, తన బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై కొత్త చిత్రాన్ని...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న...

హే బల్‌వంత్‌పై భారీ అంచనాలు.. సుహాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న...

బన్నీవాస్, వంశీ నందిపాటి సక్సెస్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’ ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది....

రాజకీయం

హిందూపురం బాలిక కేసులో కీలక మలుపు: ఇన్‌స్టాగ్రామ్ ట్రాప్, ఇద్దరు నిందితులు అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలో మూడు రోజుల క్రితం బయటపడిన మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోవర్ధన్...

Breaking News: బొత్సపై హెరిటేజ్ లీగల్ నోటీసు..

అమరావతి: తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్...  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు...

నారా లోకేష్ మీద దుష్ప్రచారం.! పరువు పోగొట్టుకున్న వైఎస్సార్సీపీ.!

కోటి రూపాయల ప్రజాధనాన్ని నారా లోకేష్ దుర్వినియోగం చేసిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం, ఆ పార్టీ పరువుని బజార్న పడేసింది. ఇటీవల కొలంబోలో ఇండియా - పాకిస్తాన్ జట్ల మధ్య...

ఫలితాల దిశగా కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలు

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ నీటి నిర్వహణ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల్లో కీలకమైన నీటి భద్రత దిశగా రాయలసీమలోని అన్నమయ్య జిల్లా గట్టి...

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

ఎక్కువ చదివినవి

ఇంట్లో విందుతో బంధం బలపడింది

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూటమి ప్రజాప్రతినిధులను కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా కలుసుకునే సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఉండవల్లి...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా, ప్రేమకథగా...

విజయ్–రష్మిక పెళ్లి తేదీ ఖరారు.. ఫిబ్రవరి 26 ముహూర్తానికి ప్రత్యేకత

టాలీవుడ్‌లో మోస్ట్ రూమర్డ్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం త్వరలో జరగనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వీరి పెళ్లి జరుగుతుందనే సమాచారం...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఈ వారం ఓటీటీల్లో ఎంటర్‌టైన్‌మెంట్ వర్షం!

ఫిబ్రవరి 16 నుంచి 22 మధ్య ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వరుసగా విడుదలకు వస్తుండటంతో డిజిటల్ ప్రేక్షకులకు వినోదోత్సవం మొదలైంది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన...