Switch to English

నారా లోకేష్ పాదయాత్ర.! సజావుగా సాగేనా.?

91,241FansLike
57,313FollowersFollow

ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల రోజులపాటు ఈ పాదయాత్ర నిర్వహిస్తానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

తెలుగు నేలకి రాజకీయ నాయకుల పాదయాత్రలు కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల.. ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేసిన నాయకులకు కొదవేమీ లేదు. అందులో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు పాదయాత్రలు కలిసొచ్చాయ్.

ఫాఫం వైఎస్ షర్మిల మాత్రం, అంత కష్టపడ్డా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. అన్నగారు ‘వాడుకుని వదిలేశారు’ అంటూ ఈ వ్యవహారంపై చాలా విమర్శలు వస్తుంటాయనుకోండి.. అది వేరే సంగతి.

నిజానికి, ఓ మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో షర్మిలకు సాటి ఇంకెవరూ రారు. ఇంకోసారి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.. అదీ తెలంగాణలో.

నారా లోకేష్ పాదయాత్ర విషయానికొస్తే, గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు రాజకీయాల్లో మారిన పరిస్థితులు వేరు. రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగెయ్యాలంటే అధికారంలో వున్నవారు నానా రకాల ఆంక్షలూ పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సామాన్యులకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం.

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ఇలా ఏ రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా, వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. పార్టీల కార్యాలయాలపైకి నిర్లజ్జగా దూసుకెళుతున్నాయి వైసీపీ మూకలు. ఏమన్నా అంటే, ‘బీపీ వస్తుంది మా కార్యకర్తలకి’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సెలవిస్తారాయె.

మరి, నారా లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుంది.? వైసీపీ మూకల నుంచి లోకేష్ పాదయాత్రకు రక్షణ ఎలా.? ఐడీ కార్డులు చూపించి, ప్రత్యేక అనుమతులు తీసుకుని లోకేష్, ఆయన వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాల్సి వస్తుందా.? ఈలోగా వైసీపీ కార్యకర్తలకు బీపీలు రాకుండా వుంటాయా.? వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్- లోకేశ్ కనగరాజ్ సినిమా ‘లియో’..! ఆసక్తి పెంచుతున్న టీజర్

ఖైదీ, విక్రమ్ సినిమాలు తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ తో మాస్టర్...

బాలయ్య షో లో కనిపించని చిరు అక్కడ ప్రత్యక్షం అయ్యారు!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ లేదా చివరి ఎపిసోడ్ లో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి...

సాయి పల్లవిని పట్టించుకోవడం మానేసి తెలుగు నిర్మాతలు

ఫిదా సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ అమ్మడు సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానం కలుగుతుంది....

అందాలు చూపిస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్న లెజెండ్రీ స్టార్‌ కిడ్‌

శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా చూడాలని దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీదేవి అభిమానులు కోరుకున్నారు. శ్రీదేవి బతికుండగానే జాన్వీ కపూర్ హీరోయిన్...

సువర్ణసుందరి రివ్యూ: బోరింగ్ ట్రీట్మెంట్

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన తారాగణంగా వచ్చిన ఈ ‘సువర్ణ సుందరి’ ఈరోజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించిందో...

రాజకీయం

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్సెస్ అనిల్.! నవరస నటనా సార్వభౌములు.!

పొరపాటున సినిమాట్లో నటించే నటీనటులకు ‘నటన’ పరంగా అవార్డులు ఇస్తున్నారుగానీ.. అసలంటూ అవార్డులు ఇవ్వాల్సింది రాజకీయ నాయకులకేనట. అలాగని రాజకీయ నాయకులే చెబుతోంటే, ‘కాదు’ అని మనమెలా అనగలం.? అన్న చర్చ జన...

‘నన్ను ఫోన్ లో బెదిరిస్తే మీకు వీడియో కాల్స్ వస్తాయి’ సజ్జలకు కోటంరెడ్డి కౌంటర్

తనపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన విమర్శలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను...

ఉత్త ‘సలహా’కి వృధాగా ఖర్చవుతున్న ప్రజాధనం.!

‘మేం అస్సలు అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన సొమ్ములు వెళ్ళేలా చేస్తున్నాం..’ అంటోంది వైసీపీ సర్కారు.! సరే.. అది నిజమే అనుకుందాం.! సలహాదారుల సంగతేంటి.? కుప్పలు...

నెల్లూరు పెద్దా‘రెడ్ల’ ముందస్తు రాజకీయం.?

అదేంటో, అధికార పార్టీకి సొంత సామాజిక వర్గంగా చెప్పబడే ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచే ప్రకంపనలు మొదలయ్యాయ్.! నెల్లూరు జిల్లాకి చెందిన ఇద్దరు ‘రెడ్లు’ పార్టీ వీడనున్నారు. మరో ‘రెడ్డి’గారూ అసంతృప్తితో వున్నారు....

మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తారకరత్న..! టీడీపీ నేత లక్ష్మీనారాయణ..

లోకేశ్ పాదయాత్రలో తీవ్ర గుండెపోటుకు గురైన హీరో తారకరత్న బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. హీరో బాలకృష్ణ...

ఎక్కువ చదివినవి

విమానంలో ప్రయాణికురాలి వీరంగం..! సిబ్బందిపై దాడి.. అర్ధనగ్నంగా తిరిగి..

ఇటివల విమానాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. విమానాల్లో మహిళపై, మరో మహిళ దుప్పటిపై మూత్ర విసర్జన, ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం, ఎయిర్ హోస్టెస్ తో వివాదం,...

రైటర్ పద్మభూషణ్ రివ్యూ – ఎంటర్టైనింగ్, ఎమోషనల్

కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డీసెంట్ బజ్ క్రియేట్ చేసింది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ఈ సినిమాను...

బిగ్ క్వశ్చన్: వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు.?

రోజులు గడుస్తున్నాయ్.. రోజులు కాదు, నెలలు.. సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయ్.! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్నది మాత్రం తేలలేదు. మాజీ మంత్రి, మాజీ ఎంపీ అయిన వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత...

ప్రిన్సిపల్ వేధింపులు… బొట్టు, గోరింటాకు పెట్టుకుంటే కూడా!!

బొట్టు, గోరింటాకు పెట్టుకుని వస్తున్నారని జరిమానాలు విధిస్తోంది ఓ ప్రిన్సిపల్. కర్నూల్ జిల్లా డిఎంహెచ్వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ గా 30 మంది విద్యార్థినులు శిక్షణ...

లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు

ఎన్నో మరపురాని చిత్రాలు అందించిన లెజండరీ దర్శకులు కె విశ్వనాథ్ ఇకలేరు. ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. చెన్నైలోని విజయ వాహిని స్టూడియోస్ లో సౌండ్...