శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు మరియు వారి కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ డిన్నర్ మీట్ ఉండవల్లి నివాసంలో హర్షోల్లాసంగా జరిగింది. రాజకీయ కార్యక్రమం కంటే కుటుంబ వాతావరణంలో జరిగిన ఈ కలయిక అందరికీ స్వీట్ మెమోరీస్‌ను మిగిల్చింది. ఫ్యామిలీ పార్టీలా సాగిన ఈ విందులో ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు.
ప్రతి కుటుంబాన్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ, పేరుపేరునా పలకరిస్తూ నారా లోకేష్ ఆత్మీయత చూపారు. అతిథులు అందించిన దేవుని ప్రతిమలను చెప్పులు తీసి భక్తితో స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నపిల్లలతో మాట్లాడి, వారు ఏం చదువుతున్నారో తెలుసుకుని, కాసేపు వారితో ఆటలాడుతూ స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించారు. డిన్నర్ మీట్‌కు హాజరైన మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందించి సన్మానించారు.
ప్రజాప్రతినిధులు తనకు అందించిన వినతులపై ఎంతవరకు పరిష్కారం కల్పించామో, ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలేమిటో వివరిస్తూ ఒక నివేదికను కూడా లోకేష్ అందజేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వడం ద్వారా ప్రజాప్రతినిధుల్లో విశ్వాసాన్ని పెంచారు.
ఈ ఆత్మీయ కలయికకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు), పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), డి కావ్య కృష్ణారెడ్డి (కావలి), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), కాకర్ల సురేష్ (ఉదయగిరి), ఎమ్మెల్సీ బీద రవిచంద్ర హాజరయ్యారు. తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్ (గూడూరు), నెలవల విజయశ్రీ (సూళ్లూరుపేట), కురుగొండ్ల రామకృష్ణ (వెంకటగిరి), సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (సర్వేపల్లి), బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (శ్రీకాళహస్తి), ఆరని శ్రీనివాసులు (తిరుపతి), ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.
రాజకీయ బాధ్యతల మధ్య కుటుంబ సమేతంగా కలిసిన ఈ డిన్నర్ మీట్ ప్రజాప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మరింత సమన్వయంతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చింది.




