Nara Lokesh: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయి కువైట్ లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న మహిళను క్షేమంగా స్వస్థలానికి రప్పించారు. దీంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వివరాల్లోకి వెళ్తే..
జీవనోపాధి నిమిత్తం తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన వరగంటి సుగుణ కువైట్ వెళ్లారు. అయితే.. ఆమె ఏజెంట్ చేతిలో మోసపోయారు. దీంతో ఆమె తాను పడుతున్న ఇబ్బందిని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. స్పందించిన మంత్రి లోకేశ్ ఆమెను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె తాను పడుతున్న అవస్థలను వివరించారు. ఎలాగైనా రక్షించి స్వస్థలానికి చేర్చాలని వీడియోలో మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు.
స్పందించిన లోకేష్ ఇందుకు తగిన ఏర్పాట్లే చేశారు. తన టీమ్ ద్వారా సుగుణను క్షేమంగా ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. లోకేశ్ చేసిన సాయానికి ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.