ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. ఈ నిర్ణయం చుట్టూ ఎంతో మంది స్టూడెంట్ల ఆవేదన దాగుంది. ఇన్ని రోజులు పదో తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ మధ్యాహ్న భోజనం అమలులో ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్ణయించారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా బలమైన నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే పేద, దిగువ మధ్యతరగతికి చెందిన ఎంతో మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న భోజనం చాలా అవసరం. ఆకలి అనేది చదువుకు అడ్డు వస్తున్నట్టు లోకేష్ గుర్తించారు.
పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థులు ఇంటర్ డ్రాపౌట్ అవుతున్నట్టు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమస్య ఉండొద్దని.. అది వారి చదువుకు అంతరాయం కావొద్దని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది ఉంది. కానీ వైసీపీ హయాంలో దాన్ని రద్దు చేయగా.. ఇప్పుడు లోకేష్ మళ్లీ ప్రారంభిస్తున్నారు. దాంతో ఆయన నిర్ణయం మీద సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు వస్తున్నాయి. పూర్వ విద్యార్థులు ఎంతో మంది తాము చదువుకునే రోజుల్లో మధ్యాహ్న భోజనం లేక ఎలా ఇబ్బంది పడ్డామో చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
ఈ విషయంలో ఎలాంటి భేషజాలకు పోకుండా విద్యార్థుల జీవితాల కోసం ఆలోచించడం చాలా ఉత్తమమైన పని అని లోకేష్ ను అభినందిస్తున్నారు. ఇలాంటి చర్యలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు