Switch to English

దేవుడి స్క్రిప్ట్.! ఏది శాశ్వతం వైఎస్ జగన్.?

91,316FansLike
57,002FollowersFollow

ఒక్క రాజధాని కాదు, రాష్ట్రానికి మూడు రాజధానులుండాలంటూ.. వున్న ఒక్క రాజధానినీ అయోమయంలో పడేసిన ఘనత వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే చెల్లుతుంది. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. ఏ రాష్ట్రంలోనూ రాజధాని పట్ల నిర్లక్ష్యం లేదు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్.

అధికారంలోకి వచ్చాక, తమ రాజకీయ ప్రత్యర్థి అయినాగానీ, అంతకు ముందు ముఖ్యమంత్రిగా వున్న జయలలిత పేరు చెరిపెయ్యలేదు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. పైగా, జయలలిత ఫొటోలున్న స్కూలు బ్యాగుల్నే తమ హయాంలోనూ పంపిణీ చేశారు. నిజానికి, కక్ష సాధింపు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. కానీ, అక్కడా అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి వేరు. ఇక్కడి రాజకీయాలు వేరు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వేరు. రాజధాని దగ్గర్నుంచి, ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వరకు.. వైసీపీ చేస్తున్నది ఎవరి కోసం.? ఎందుకోసం.? వీటి వల్ల వైసీపీకి అయినా ప్రయోజనం వుంటుందా.? ప్చ్.. అదే ఆ పార్టీ శ్రేణులకీ అర్థం కావడంలేదు.

‘ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు.. రెండూ ఒకే రోజు.. దేవుడి స్క్రిప్ట్.. జగన్ రెడ్డి భవిష్యత్తేంటో.? అంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీటేశారు. దేవుడి స్క్రిప్ట్.. ఈ మాట పదే పదే చెబుతుంటారు వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీడీపీని విమర్శించే క్రమంలో.

దేవుడి స్క్రిప్ట్ నిజంగానే అదిరిపోయింది.. ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మార్చిన రోజే, ‘వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియామకం చెల్లదు..’ అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చేయడం. లేని అధికారాల్ని తనకు ఆపాదించేసుకుని, తాను ‘డిక్టేటర్’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పార్టీలో అయినా, ప్రజాస్వామ్యంలో అది కుదరదు.

అలాంటిది, ముఖ్యమంత్రిగా ‘డిక్టేటర్’ తరహా నిర్ణయాలు తీసుకుంటే అవెలా చెల్లుతాయ్.? ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగుల దగ్గర్నుంచి, మూడు రాజధానుల వరకు.. అన్ని విషయాల్లోనూ మొట్టికాయలే. అయినాగానీ తగ్గేదే దే.! విపక్షాలకు చెందినవారిని కావొచ్చు.. తమ సమస్యల కోసం నినదిస్తున్న సామాన్యుల్ని కావొచ్చు.. పోలీసులు అరెస్టు చేస్తోంటే, ప్రతి అరెస్టూ ఓ చెంప దెబ్బలా మారుతోంది ప్రభుత్వానికి.!

ఏం పాలన జరుగుతోంది రాష్ట్రంలో.? అసలు దీన్ని పాలన అంటారా.? ఇదీ దేవుడి స్క్రిప్ట్ అంటే.! గెలిచింది కూల్చడం కోసం, ముక్కలు చేయడం, కోసం, పేర్లు మార్చుకోవడం కోసం.. ఆపై మొట్టికాయలు తినడం కోసం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

కాంట్రావర్సి సమసిపోయింది- ‘యశోద’ నిర్మాత కృష్ణప్రసాద్

సమంత టైటిల్ పాత్రలో హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా 'యశోద'. నవంబర్ 11న...

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

రాజకీయం

ఏపీ నూతన సీఎస్ గా కె.ఎస్.జవహర్ రెడ్డి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్.జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో...

అమరావతిపై సుప్రీం ఏం చెప్పింది.? వీళ్ళకి ఏం అర్థమయ్యింది.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారుకి ఊరట.! కాదు కాదు, హైకోర్టుకే మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు.! పచ్చ బ్యాచ్ అమరావతి నుంచి మూటాముళ్ళు సర్దుకోవాల్సిందే.! ఏపీకి మూడు రాజధానులు తథ్యం.! సుప్రీం...

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఎక్కువ చదివినవి

హైదరాబాద్ లో ఘోరం..! పదో తరగతి విద్యార్ధినిపై తోటి విద్యార్ధులు గ్యాంగ్ రేప్

హైదరాబాద్ లో మరో ఘోరం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై అదే తరగతిలోని తోటి విద్యార్ధులు ఐదుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన కలకలం రేపుతోంది. ఈ...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

మోక్షజ్ఞ ఎంట్రీ షురూ..! సినిమాపై.. దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ..

నందమూరి అభిమానుల ఎదురుచూపులకు తెర దించుతూ నటసింహం బాలకృష్ణ కీలక అనౌన్స్ మెంట్ చేశారు. తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రానికి ముహూర్తం కుదిరిందనే కీలక అప్డేట్ ఇచ్చారు. గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్లో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా.?

ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు...

‘జడ్జిల బదిలీ వెనక్కు తీసుకోవాలి..’ ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం గురువారం వివిధ హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరిలో తెలంగాణ హైకోర్టు...