చంద్రబాబు నాలుగోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి వస్తున్న సంక్రాంతి పండుగ. దీంతో చంద్రబాబు కుటుంబం చిత్తూరు జిల్లాలోని నారా వారి పల్లెలో సంక్రాంతి సంబురాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కలిసి సంబురాల్లో సందడి చేశారు.
చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా సంక్రాంతి పోటీల్లో చురుగ్గా పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా అక్కడ మహిళలు వేసిన రంగవల్లులను పరిశీలించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఈ ముగ్గుల పోటీల్లో దాదాపు 126 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు.
ముగ్గులు వేసిన మహిళలందరికీ సంక్రాంతి పండగ కానుకగా రూ.10116 చొప్పున ఇస్తామని ప్రకటించారు. దాంతో సభ మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఇక చంద్రబాబు నాయుడు అక్కడకు వచ్చిన చాలా మంది నుంచి అర్జీలను స్వీకరించారు. నారా వారి పల్లెలో అందరి సమస్యలను పరిష్కరిస్తామంటూ తెలిపారు సీఎం చంద్రబాబు. అంతే కాకుండా విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
రేపు సంక్రాంతి సంబరాల్లో కూడా పాల్గొనబోతున్నారు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నారా వారి పల్లెలోనే వారు భస చేయబోతున్నారు.