మెగాస్టార్‌ చిరంజీవితో గ్యాంగ్‌ లీడర్‌ మల్టీ స్టారర్‌.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,629FansLike
57,764FollowersFollow

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో టాప్‌ టెన్‌ సినిమాల లిస్ట్‌ తీస్తే, అందులో ఖచ్చితంగా ‘గ్యాంగ్‌ లీడర్‌’ పేరు వుంటుంది. చిరంజీవిని మాస్‌ ఆడియన్స్‌కి మరింత దగ్గర చేసిన సినిమా అది. ఆ ‘గ్యాంగ్‌ లీడర్‌’ టైటిల్‌తో నాని ఇప్పుడు ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నాడు. కొన్ని అనివార్య కారణాలతో ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఒరిజినల్‌ టైటిల్‌, నాని సినిమాకి దక్కలేదు. చిత్రమేంటంంటే, మెగాస్టార్‌ చిరంజీవి అభిమాని ఒకరు ‘గ్యాంగ్‌ లీడర్‌’ పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తుండడం. ఈ టైటిల్‌ విషయమై చాలా రచ్చ జరిగింది.

మరోపక్క, ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి సూపర్‌ హిట్‌ సినిమా టైటిల్‌ని, ఓ సాధారణ సినిమాకి ఎలా పెడతారు.? అంటూ మెగా అభిమానులు నానిపై టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ రోజునే విరుచుకుపడిపోయారు. అయితే, ఆ తర్వాత కూల్‌ అయ్యారనుకోండి.. అది వేరే విషయం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఒకప్పటి చిరంజీవి లుక్‌లో కన్పించేలా నానితో ఓ లుక్‌ డిజైన్‌ చేయించి, సోషల్‌ మీడియాకి వదిలారు ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ నిర్మాతలు.

Also Read: కాపీ ‘గ్యాంగ్‌ లీడర్‌’.. అంత కోపమైతే ఎలా నానీ.?

ఆ సంగతి పక్కన పెడితే, చిరంజీవితో మల్టీస్టారర్‌ చేయాలన్నది తన డ్రీమ్‌ అని నాని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆల్రెడీ అక్కినేని నాగార్జునతో నాని ‘దేవదాసు’ సినిమాలో కలిసి నటించిన విషయం విదితమే. డ్రీమ్‌ మల్టీస్టారర్‌ అంటే చిరంజీవితోనేనని నాని స్పష్టం చేశాడు. ఇదిలా వుంటే, ఒకప్పుడు చిరంజీవి సినిమాలు చూసేందుకు తాను క్యూ లైన్లలో నిలబడి పడ్డ పాట్లు గురించి ఓ సందర్భంలో నాని చెప్పడం, సినిమా చూసే అత్యుత్సాహంలో సైకిల్‌ని పోగొట్టుకున్నానని నాని స్వయంగా చిరంజీవి ముందే వివరించడం, దానికి కాంపెన్సేషన్‌గా చిరంజీవి, ‘మీలో ఎవరు కోటీశ్వరుడ’ టైమ్‌లో నానికి కొత్త సైకిల్‌ కొనివ్వడం తెలిసిన సంగతులే.

కాగా, ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో నానికి వున్న క్రేజ్‌ సంగతి కొత్తగా చెప్పేదేముంది. ఓవర్సీస్‌లోనూ సినిమా పట్ల క్లీన్‌ బజ్‌ కన్పిస్తోంది. ఓవర్సీస్‌లో నాని తొలి రోజు వసూళ్ళ పరంగా తన కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు.

4 COMMENTS

సినిమా

Karuppu: ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన కరుప్పు టీమ్.. కారణమిదే

Karuppu: తమిళ హీరో సూర్య నటించిన సినిమా కరుప్పు. తెలుగులో వీరభద్రుడుగా విడుదలైంది. ఇటివల విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సూర్య కెరీర్లో అత్యధిక...

Jr.Ntr Birthday Special: ‘పాత్రేదైనా పరకాయప్రవేశమే..’ ఎన్టీఆర్ నటనలో స్పెషల్

Jr.Ntr Birthday Special: జూనియర్ ఎన్టీఆర్ ఫిల్మోగ్రఫీలో ఉన్న సినిమాల్లో ఆయన నటనకి ఎక్కువ మార్కులు పడుతూంటాయి. కారణం, నటనలో ఇంటెన్సిటీ. కళ్లలో తీక్షణత, డైలాగ్...

మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి అరుదైన కల్ట్ సినిమా పెద్ది: రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు...

పెద్ది ట్రైలర్‌ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ విజువల్...

Peddi ట్రైలర్‌తో మరోసారి దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేశారు Ram Charan. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్...

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు...

రాజకీయం

రోడ్ల పనుల నుంచి గ్రీన్ షాపుల వరకు పూర్తి పారదర్శకత ఉండాలి: పవన్ కళ్యాణ్

పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధి పనులు, వాటి పురోగతి,...

గద్వాల్ నుంచి జనసేనలో కొత్త జోష్.. ప్రేమ్ కుమార్‌ను కలిసిన నూతన సభ్యులు

గద్వాల్ జిల్లా మనపాడు మండలం నుంచి జనసేన పార్టీలో నూతనంగా చేరిన సభ్యులు, మహబూబ్‌నగర్ పార్లమెంట్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కోఆర్డినేటర్ Mummareddy Prem Kumarను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి...

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

ఎక్కువ చదివినవి

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

చిన్న వయసులోనే యూట్యూబ్‌లోకి నారా దేవాన్ష్.. ‘Dino Deets’ ప్రారంభం

మంత్రి Nara Lokesh తనయుడు Nara Devaansh చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ‘Dino Deets’ పేరుతో దేవాన్ష్ ప్రారంభించిన కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు...

“20 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి ఎంఎస్ఎంఈ లే బలం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి Nara Lokesh పేర్కొన్నారు....

Daily Horoscope: సింహ రాశివారికి శుభవార్తలు.. తుల రాశివారికి ఆర్థిక జాగ్రత్తలు అవసరం

మే 15 , 2026 శుక్రవారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల పరిణామాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు ‘పెద్ది’పై పాజిటివ్‌గా మాట్లాడటం ఇండస్ట్రీలో ఆసక్తికర...