న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం తర్వాత హిట్ 3 సినిమా చేస్తున్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని లోని మరో యాంగిల్ ని చూపించబోతున్నారని తెలుస్తుంది. హిట్ 3 ఆల్రెడీ సగానికి పైగా షూటింగ్ పూర్తైంది. ఐతే ఈ సినిమా తర్వాత నాని మరోసారి దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
నాని, శ్రీకాంత్ ఓదెల, సుధాకర్ చెరుకూరి ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది. నాని కోసం ఈసారి శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు. ఈ టైటిల్ చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. హిట్ 3 పూర్తి చేయకముందే ప్యారడైజ్ పనులు మొదలు పెట్టాడట నాని.
తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్యారడైజ్ నుంచి త్వరలో ఫస్ట్ లుక్ టీజర్ రాబోతుందని అంటున్నారు. నాని శ్రీకాంత్ కలిసి దసరా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించారు. ఇప్పుడు ఆ కాంబో రెండో ప్రయత్నంగా ప్యారడైజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తారని టాక్. మరి నాని ప్యారడైజ్ ఎలా ఉండబోతుంది. దసరా కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలి.