Switch to English

ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉండే సినిమా టక్ జగదీష్ – నాని

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. షైన్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది రూపొందించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అవుతోంది. నిన్ను కోరి చిత్రానికి పనిచేసిన నాని, శివ నిర్వాణ కాంబినేషన్ టక్ జగదీష్ కు మరోసారి రిపీట్ అయింది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన నిన్ను కోరి, మజిలీ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ మూడో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.

ఈ సందర్భంగా నాని మీడియాతో ముచ్చటించారు. “థియేటర్లలో నన్ను నేను చూసుకోవడాన్ని బాగా మిస్ అవుతున్నాను. గతేడాది దాదాపుగా ఇదే సమయంలో వి చిత్రం ఓటిటిలోవిడుదలైంది. ఇప్పుడు కూడా నా సినిమా ఓటిటిలోనే వస్తోంది. పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నా నెక్స్ట్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయడానికి చూస్తాను. ఒక్కసారి పరిస్థితులు అనుకూలిస్తే విడుదల కావడానికి చాలానే సినిమాలు ఉన్నాయి.”

ఇక టక్ జగదీష్ ఎలా మొదలైంది అన్నదానికి బదులిస్తూ… “నేను వేరే సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటే శివ ఫోన్ చేసాడు. కథ ఒకటి ఉంది. చెప్పాలని అన్నాడు. మజిలీ లాంటి మరో కథే చెబుతాడు నో చెప్పేద్దాం అనుకుని, ఫోన్ లోనే చెబితే మర్యాదగా ఉండదని నేరుగా చెప్పడానికి పిలిచాను. కానీ ఓపెనింగ్ లైన్ చెప్పగానే ఇన్స్టంట్ గా కనెక్ట్ అయ్యాను. భూదేవిపురం భూమి తగాదాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నాడు. నాజర్ వాయిస్ లో అరేయ్ జగదీ.. మగవాడు ఏడవకూడదు, ఆడదాన్ని ఏడిపించకూడదు అని చెప్పాడు. శివ రెండూ సినిమాలు కూడా ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్. ఈసారి దానికి తోడు యాక్షన్ పార్ట్ ను కూడా టచ్ చేస్తున్నాడు. శివ ఎమోషన్ ను బాగా హ్యాండిల్ చేయగలడు. సో ఫ్యామిలీ సినిమాలను, యాక్షన్ పార్ట్ ను ఇంకా బాగా హ్యాండిల్ చేయగలడు అనిపించింది. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను కాబట్టి వెంటనే ఓకే చెప్పేసాను.”

“నిజానికి టక్ జగదీష్ మొదట క్యారెక్టర్ పేరు మాత్రమే. సినిమా పేరు అది కాదు. శివ సినిమా తన పాత్రలకు మంచి మంచి పేర్లు పెడతాడు. ఆయన చూసిన, తెల్సిన పేర్లనే పాత్రలకు పెడుతుంటాడు కాబట్టి జనాలకు వెంటనే కనెక్ట్ అవుతుంది. ఆ క్రమంలోనే నాకు కూడా జగదీష్ అని పెట్టాడు. దానికి ముందు టక్ తగిలించాడు. దీని వెనుక ఒక రీజనింగ్ ఉంది. అసలు జగదీష్ ఎందుకు టక్ చేసుకుంటాడు అన్నది సెకండ్ హాఫ్ లో వస్తుంది. ఆ సీన్ ను చాలా బాగా రాసుకున్నాడు శివ.”

“ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చాలా మంచి పాత్రలు దక్కాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ పై నడిచే ఈ కథకు రీతూ వర్మ క్యారెక్టర్ మంచి రిలాక్స్ లా అనిపిస్తుంది. అలాగే చంద్రమ్మ పాత్రలో ఐశ్వర్య రాజేష్ పాత్ర సినిమాకు ఆయువు పట్టు. చంద్రమ్మ కోసం జగదీష్ ఎంత దూరం వెళ్లాడన్నదే ఈ సినిమా పాయింట్. ఒక కుటుంబంలో ఉండే అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో కూడా ఉంటాయి. బోసు, జగదీష్ మధ్య అన్నదమ్ముల సంఘర్షణ చాలా బాగా చూపించారు. ముఖ్యంగా హీరో నాన్న కోణంలో నుండి వీరిద్దరినీ చూడటం చాలా బాగుంటుంది. అదే శివ నిర్వాణ గొప్పదనం.”

“నాకు రీమేక్స్ సరిపడవు. కెరీర్ ప్రారంభంలో రెండు రీమేక్స్ చేశాను. అవి అంతలా ఆడలేదు. అందుకే రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, మీకు కొత్త కథలు అందించడానికి రీమేక్స్ సరిపోవు. అందుకే మన సినిమాలనే వేరే వాళ్ళు రీమేక్స్ చేసేలా చేద్దాం. టక్ జగదీష్ కు ఇంటర్వెల్ కార్డ్ పడదు. అమెజాన్ వాళ్ళు అలా వేయరు. అందుకే మీకోసం నేను ట్విట్టర్ లో ఇంటర్వెల్ కార్డ్ ను స్క్రీన్ షాట్ తీసి పెడతాను. టక్ జగదీష్ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు అన్న మాటలకు బాధ వేసింది. పరిస్థితులు బాగుంటే సంవత్సరానికి మూడు సినిమాలు ఇవ్వడానికి నేను రెడీ. టక్ జగదీష్ వెళ్ళిపోతోందని వాళ్ళు బాధపడ్డారు కానీ మరో రెండు సినిమాలను నేను సిద్ధం చేస్తున్నాను. రేపు విడుదలవుతోన్న సీటిమార్, తలైవి చిత్రాలు అద్భుత విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని నాని ముగించాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Hyderabad: ధీర వనితలు..! పోరాడి దొంగలను పోలీసులకు పట్టించారు

Hyderabad: నాటు పిస్తోలుతో బెదిరించిన ఇద్దరు దొంగలను.. తల్లీ, కుమార్తె ధైర్యంగా ఎదుర్కొన్న ఘటన హైదరాబాద్ (Hyderabad) లో జరిగింది. ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రసూల్ పురా జైన్...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...