ఓ పక్క హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తూనే నిర్మాతగా కూడా కొత్త కథలతో వస్తున్నాడు నాని. లేటెస్ట్ గా నాని నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఏ నోబడె.. రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజి ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు నాని సోదరి దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న రిలీజైన కోర్ట్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్ ఆఫ్ ఆడియన్స్ వర్డిక్ట్ అంటూ ఒక ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో నాని స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది. ఈరోజు దాకా స్క్రిప్ట్, ప్రేక్షకులు ఈ రెండు విషయాలనే నమ్మాను. స్క్రిప్ట్ మా టీంని గెలిపించింది. తెలుగు ప్రేక్షకులు సినిమాను గెలిపించారు. కోర్ట్ సినిమా నన్ను గెలిపించిందని అన్నారు నాని. ఈ సినిమా టీం విషయంలో చాలా ప్రౌడ్ గా ఉందని అన్నారు నాని. సినిమాను ముందుకు తీసుకెళ్తున్న అందరికీ థాంక్స్ అని చెప్పారు.
డైరెక్టర్ జగదీష్ ని చూసిన వెంటనే నమ్మకం కలిగింది. ఐతే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాక కూడా మొదట చూసినప్పుడు ఎలా ఉన్నాడో అలానే సింపుల్ గా ఉన్నాడు. ఇది గ్రేట్ క్వాలిటీ అన్నారు నాని. సినిమాకు పనిచేసిన టెక్నికల్ టీం దినేష్ సినిమాటోగ్రఫీ, విట్టల్ ఆర్ట్ డైరెక్షన్, ఎడిటర్ కార్తీక్, మ్యూజిక్ విజయ్ ఇలా సినిమాకు పనిచేసిన వారందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నాని.
వాల్ పోస్టర్ సినిమా టీమ్ కు స్పెషల్ థాంక్స్ చెప్పారు నాని. ప్రశాంతితో కలిసి ఇలాంటి మంచి సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ సినిమాకు సంబందించి అన్ని విషయాలు దీప్తి అక్కకి అప్పగించా.. ఈ సినిమాను చాలా బాగా చూసుకుందని అన్నారు నాని.
కోర్ట్ నటీనటుల గురించి మాట్లాడుతూ రోషన్, శ్రీదేవి బ్యూటిఫుల్ పర్ఫార్మ్ చేశారు.. రోహిణి గారు మా అమ్మ.. ఆమెను చూస్తే పాజిటివిటీ వస్తుంది. శివాజి గారు ఈ సినిమాలో విజృంభించి చేశారు. ప్రియదర్శి తెలుగు సినిమాకు నసీరుద్ధీన్ షా అని అన్నారు నాని. ఈ సెలబ్రేషన్స్ త్రూ అవుట్ ది ఇయర్ కంటిన్యూ అవ్వాలని కోరుతున్నా అన్నారు నాని. నానితో పాటు సినిమాకు పనిచేసిన వారంతా కూడా కోర్ట్ గురించి తమ అనుభవాలను పంచుకున్నారు.