అల్లు అర్జున్ ప్రమేయం లేకపోయినా జరిగిన పొరపాటుకు ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ కొన్ని రోజులుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అల్లు అర్జున్. అయితే తాజాగా ఈ కేసులో ఆయనకు భారీ గుడ్ న్యూస్ వచ్చింది. అసలేం జరిగిందంటే.. 2024 ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ తన ఫ్రెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది పెద్ద దుమారమే రేపింది. వైసీపీ అభ్యర్థి అయిన రవి ఇంటికి వెళ్లి మరీ సపోర్టు చేశాడు అల్లు అర్జున్.
దాంతో మెగా ఫ్యాన్స్, జనసైనికులు బన్నీని తిట్టిపోశారు. పవన్ కు వెన్నుపోటు పొడుస్తున్నాడంటూ కామెంట్లు చేశారు. అయితే బన్నీ అక్కడకు వెళ్లిన సమయంలో భారీగా అభిమానులు ఆయన్ను చూడటానికి వచ్చారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ అల్లు అర్జున్ మీద నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలంటూ బన్నీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కొన్ని రోజులుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో ఈ రోజు కోర్టు తుది తీర్పును వెల్లడించింది.
బన్నీపై పోలీసులు పెట్టిన ఈ కేసును కోర్టు కొట్టేసింది. దాంతో ఆయనకు ఈ కేసులో భారీ ఊరట లభించింది. అటు బన్నీ ఫ్యాన్స్ తమ హీరోనే గెలిచాడంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంకొందరేమో.. సంబంధం లేని కేసులో ఇరుక్కుని మొత్తానికి బయట పడ్డాడన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు.