Nandamuri Mokshagna: నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా మరో యువ కిశోరం, హీరో నందమూరి బాలకృష్ణ తనయుడి తెరంగేట్రానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఆయనే ‘నందమూరి మోక్షజ్ఞ’. బాలకృష్ణ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సందర్భంపై మరికొన్ని రోజుల్లోనే పూర్తి క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం..
‘హను-మాన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ హీరోగా తొలి సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా బాలకృష్ణతో జరిపినట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఇమేజ్, ప్రశాంత్ వర్మ మార్క్ సోషియో ఫాంటసీ నేపథ్యంలోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన రావొచ్చని సమాచారం.
బాలకృష్ణ 50ఏళ్ళ నట ప్రస్థానం వేడుక సెప్టెంబర్ 1న, మోక్షజ్ఞ పుట్టినరోజు సెప్టెంబర్ 6న ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో ఏదొక రోజున మోక్షజ్ఞ సినిమా ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ సినిమా నిర్మిస్తారని సమాచారం.