Switch to English

మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్లుందరికీ కృతజ్ఞతలు: నందమూరి బాలకృష్ణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,167FansLike
57,313FollowersFollow

గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మాసియస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’ వీరమాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా వీరసింహుని విజయోత్సవం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలో బాలకృష్ణ చేతుల మీదగా చిత్ర యూనిట్ కు మెమెంటో ప్రధాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది.

వీరసింహుని విజయోత్సవంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… నాకు ధన్యమైన జన్మనిచ్చి, నన్ను మీ అందరి గుండెల్లో ఆ మహానుభావుడి స్వరూపంగా నిలిపిన దైవాంశ సంభూతుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నా తండ్రి, నా గురువు, దైవం, ఆ కారణజన్ముడికి శత జయంతి అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడు గోపీచంద్ మొదట వచ్చినపుడు చెన్నకేశవరెడ్డి గుర్తొస్తుందని చెప్పాను. తను అయోమయంలో పడ్డాడు. సీమరక్తం కదా కుతకుత లాడుతుందని అన్నాను. వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’… అన్నాడు. ఒక అద్భుతమైన కథని రాశాడు. ఇది ఒక గొప్ప ప్రయాణం. ఈ ప్రయాణంలో అద్భుతమైన సినిమా చేశాం. తెలుగు ప్రేక్షకులతో పాటు సినిమా అభిమానులు ‘వీరసింహారెడ్డి’ అద్భుతంగా వుందని ప్రసంశించారు. వీరసింహారెడ్డి లార్జర్ దెన్ లైఫ్ మూవీ. తొడగొట్టి చెబుతున్నాను.. వీరసింహారెడ్డి లో సీమ వాసన కనిపించింది. రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. సాయి మాధవ్ బుర్రా పదునైన మాటలు రాశారు. ఇన్ని రకాల పాత్రలు చేశానంటే అది నా అదృష్టం. ఇంకా కుర్రాడిలా వుండటానికి నా రహస్యం అదే. సినిమా, నా హాస్పిటల్, హిందూపురం నియోజికవర్గం గురించి తప్పా నాకు మరో ఆలోచన లేదు. దునియా విజయ్, వరలక్ష్మీ గారు పోటాపోటీగా విలనిజం పండించారు. ఇలాంటి పాత్రలు చేయడం ఒక సాహసం. ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. వీరసింహారెడ్డి లో ఒక విస్పోటనం జరిగింది. నేపధ్య సంగీతంతో పాటు ఆణిముత్యాలు లాంటి పాటలకు మణిపూసలు లాంటి బాణీలు సమకూర్చారు తమన్. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అద్భుతమైన యాక్షన్ ని సమకూర్చారు. డివోపీ రిషి పంజాబీ, విష్ణు, ప్రసాద్ .. అద్భుతంగా పని చేశారు. ఇందులో మూడు టైం జోన్స్ వున్నాయి. టర్కీలో కూడా అందంగా చిత్రీకరించారు. హానీ రోజ్ తన పాత్రలో నవరసాలు పండించారు. శ్రుతి హాసన్, నట విశ్వరూపం కమల్ హాసన్ గారి డిఎన్ఎ. తన పాత్ర మేరకు చాలా అద్భుతంగా నటించారు. లాల్ గారు ఎక్కడా మాట్లడకుండా అద్భుతమైన పాత్ర చేశారు. చివర్లో ఆ పాత్ర పేలింది. ఈ సినిమాని ఇంత పెద్ద విజయాన్ని చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇన్నాళ్ళు అభిమానులు నాపై చూపిస్తున్న అభిమానమే నాకు శ్రీరామ రక్ష. మీ అంతులేని అభిమానం, అనంతమైన ఆత్మీయత, ఎవరికీ దక్కని ప్రేమానురాగాలు చూపిస్తున్న మీకు..మీ బాలకృష్ణ మనసు ఎప్పుడూ పరిచివుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ కి సినిమా అంటే ప్యాషన్. అందరి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఎక్కడా రాజీపడకుండా సినిమానే ఊపిరిగా జీవిస్తున్న నిర్మాతలు రవి గారు నవీన్ గారు. ఒక మంచి సినిమాకి పని చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న మాకు ప్రేక్షకులు ఇంత ఘన విజయం ఇచ్చారంటే.. మా వెన్నుతట్టి ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఇవ్వండి మమ్మల్ని పోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్లుందరికీ శిరస్సువంచి కృతజ్ఞతలు’’ తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: ఎన్టీఆర్ 30 ముహూర్తం ఖరారు.. పోస్టర్ విడుదల

Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్...

Jr.Ntr: ఏకాకి అవుతున్న ఎన్టీయార్.! సరైన ప్లానింగ్ ఏదీ.?

Jr.Ntr: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించే కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఎవరికీ తెలియదు. ‘నేనిక సినిమాలు మానేస్తా..’ అంటూ సంచలన...

Ram Charan: ‘నాన్న వల్లే.. కానీ..’ నెపోటిజంపై రామ్ చరణ్ కామెంట్స్

Ram Charan:‘స్టార్ హీరో కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడటం కష్టం.. ప్రతిభ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తార’ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్...

Legends: ఇద్దరు లెజెండ్స్.. చిరంజీవి, రామ్ చరణ్ పై అమిత్ షా...

Legends: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల...

Ram Charan: విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తా: రామ్ చరణ్

Ram Charan: అవకాశం వస్తే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలిపారు. తాజాగా...

రాజకీయం

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

Amith Shah: కేంద్ర హోంమంత్రికి నిరసన సెగ..! వీడియో వైరల్..

Amith Shah: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈ నెల 25న చత్తీస్గడ్ లోని బస్తర్ డివిజన్లోని సుక్మా జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా బస్తర్ లో బస...

Janasena: జనసేనకు 75 సీట్లు.! టీడీపీ తాజా అంచనాలివి.!

Janasena: 2‌024 జనసేన పార్టీ ప్రభావమెంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికే బాగా తెలసు.! కానీ, జనసేన ప్రభావాన్ని తగ్గించేందుకు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా శాయశక్తులా పనిచేస్తోంది. రాష్ట్రంలో దాదాపు...

Graduates: పట్టభద్రులు.. సాధారణ ప్రజల్ని ప్రభావితం చేస్తే.?

Graduates: వైసీపీలో ముసలం బయల్దేరింది. ముసలం అనాలా.? కుదుపు అనాలా.? ఆత్మపరిశీలన అనుకోవాలా.? ఈ విషయాలపై ముందు ముందు ఇంకాస్త స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో తీవ్ ప్రకంపనలకు...

Balakrishna: వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ

Balakrishna: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, ‘వైసీపీపై ప్రజా తిరుగుబాటు మొదలైంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు రెండు చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తుండడంపై...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 19 మార్చి 2023

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం సూర్యోదయం: ఉ.6:09 సూర్యాస్తమయం: రా.6:05 ని తిథి: బహుళ ద్వాదశి ఉ.6:09 వరకు తదుపరి త్రయోదశి సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం ) నక్షత్రము: ధనిష్ఠ రా.8:52 వరకు...

ఈడీ విచారణ ముగిసినట్లే.! కవితమ్మా తర్వాతేంటి.?

ఒకప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ అంటే.. ఇక అంతే సంగతులు.! కానీ, ఇప్పుడు అది కూడా ఓ పబ్లిసిటీ స్టంట్ అయి కూర్చుంది. సీబీఐ ఎప్పుడో పంజరంలో చిలక.. అన్న ఆరోపణల్ని ఎదుర్కోవాల్సి...

Rama Banam: గోపీచంద్ రామబాణం చిత్రానికి బడ్జెట్ కష్టాలు!!

Rama Banam: వరస ప్లాపులతో సతమతమవుతున్నా కానీ గోపీచంద్ కు అవకాశాలకు కొదవేం లేదు. ప్రస్తుతం తనకు రెండు హిట్లు ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్ తో సినిమా చేస్తున్నాడు. దీనికి రామబాణం అనే...

మా సినిమా హిట్ అవుతుంది:’ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్ర బృందం

రేపు( మార్చి 17న) ఫలానా అబ్బాయి, ఫలానా అమ్మాయి చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించి.. చిత్ర విజయం పట్ల వారికున్న...

Ram Charan: ఉపాసన నన్ను మిస్టర్ సి అని పిలవడానికి కారణం ఆ హోటల్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా అభిమానుల కల నెరవేర్చాడు. తాను నటించిన ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులంతా సంతోషంలో...