Nandamuri Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్ స్టాపబుల్’ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించి తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. తన టైమింగ్ తో రెండు సీజన్స్ ను బాలయ్య సక్సెస్ చేశారు. ఇదే జోరులో ఐపీఎల్ లో కూడా ఆయన అడుగుపెడుతున్నట్టు స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమయ్యే మొదటి రోజు బాలయ్య కామెంట్రీ ఉండబోతోంది. తెలుగు జాతి గర్వపడేలా బాలయ్య ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉంటుందని ట్వీట్ చేసింది. ఈనెల 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఆశిష్ రెడ్డి, ఎమ్మెస్ కే ప్రసాద్, వేణుగోపాల్ రావు, టి సుమన్, కళ్యాణ్ కృష్ణ లతో కలిసి బాలయ్య కామెంటేటర్ గా వ్యవహరిస్తారు.
అన్ స్టాపబుల్ షోలో తనదైన కామెడీ పంచులతో అలరించిన బాలయ్య స్పోర్ట్స్ కామెంటేటర్ గా మరింతగా ఎంటర్టైన్ చేస్తారంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనకి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టమని, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి అప్పుడప్పుడు క్రికెట్ ఆడే వాడినని అన్స్టాపబుల్ షోలో బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే.
గతంలో తెలుగు వారియర్స్ జట్టుకి బాలయ్య సారథిగా కూడా వ్యవహరించారు. క్రికెట్ పై బాలయ్య కి కూడా ఆసక్తి ఉండటంతో స్టార్ స్పోర్ట్స్ ఆహ్వానం మేరకు కామెంటేటర్ గా వ్యవహరించనున్నారు.