Switch to English

‘వైల్డ్ డాగ్’ మూవీ రివ్యూ : నాగ్ వన్ మ్యాన్ షో.!

Critic Rating
( 2.50 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

Movie వైల్డ్ డాగ్
Star Cast నాగార్జున అక్కినేని, సయామీ ఖేర్, దియా మీర్జా
Director ఆశిశోర్ సాల్మన్
Producer నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
Music తమన్
Run Time 2 గం 9 నిమిషాలు
Release 02 ఏప్రిల్ 2021

ఎప్పటికప్పుడు కొత్త దర్శకులతో, సరికొత్త జానర్స్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే అక్కినేని నాగార్జున చేసిన మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. ఇండియాలో తీవ్రవాదులు చేసిన బాంబ్ బ్లాస్ట్స్ సంఘటనల ఆధారంగా, రియలిస్టిక్ గా తీసిన ఈ సినిమాలో నాగ్ ఓ ఎన్.ఐ.ఏ ఏజంట్ గా కనిపిస్తాడు. హాలీవుడ్ తరహాలో పిక్చరైజ్ చేసిన ఈ వైల్డ్ డాగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

2007 హైదరాబాద్ లోని గోకుల్ చాట్ బ్లాస్ట్ తర్వాత పూణే, హైదరాబాద్ లలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ల మీద కథ మొదలవుతుంది. ఆ ఘోరమైన అటాక్స్ తర్వాత దేశ నేతలు, అధికారులంతా కలిసి ఆ బాంబ్ బ్లాస్ట్స్ చేసిన టెర్రరిస్ట్ ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ఎలా అనుకున్న టైంలో ఆ కేసుని ఎన్.ఐ.ఏకి ఇద్దామని అనుకోవడంతో ఎన్.ఐ.ఏ లో రూత్ లెస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్(నాగార్జున) చేతికి ఆ కేసు వెళ్తుంది. ఇక అక్కడి నుంచి విజయ్ వర్మ తన టీంని తయారు చేసుకొని మొదట ఏ టెర్రరిస్ట్ చేసాడని ఎలా కనుక్కున్నారు? ఎలా ఆ టెర్రరిస్ట్ ని ట్రేస్ చేశారు? దానికోసం ఎంత రిస్క్ చేశారు? ఈ సీక్రెట్ ఆపరేషన్ లో చివరికి మెయిన్ టెర్రరిస్ట్ ని పట్టుకున్నారా? లేదా? ఈ మిషన్ లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? విజయ్ ఆ మిషన్ ని చాలా సీరియస్ గా తీసుకోవడానికి కారణం ఏమన్నా ఉందా? అన్నదే కథ.

తెరమీద స్టార్స్..

ఆన్ స్క్రీన్ పరంగా ఈ సినిమాకి ప్రాణం పోసింది మాత్రం నాగార్జున. ఎన్.ఐ.ఏ ఏజంట్ పాత్రలో నాగ్ ఫిట్ లుక్ చూస్తే యువత సైతం షాక్ అవుతారు. అలాగే రూత్ లెస్ ఆఫీసర్ గా నాగార్జున పెర్ఫార్మన్స్ సూపర్బ్. యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, పర్ఫెక్షన్ అండ్ అదిరిపోయే స్టంట్స్ ఇలా ప్రతి విషయంలో అదరగొట్టాడు. దియా మీర్జా కనపడేది తక్కువ సేపే అయినా ఉన్నతలో ఓకే అనిపించింది. సయామీ ఖేర్ రఫ్ అండ్ టఫ్ సీక్రెట్ ఏజంట్ గా కనిపించి మెప్పించడమే కాకుండా కాకుండా యాక్షన్ సీన్స్ లో బాయ్స్ తో సమానంగా స్టంట్స్ చేసి మెప్పించింది. సినిమాకి కీలకమైన పాత్రలో కనిపించిన అతుల్ కులకర్ణి, అలీ రెజా, అప్పాజీ, అవిజిత్ దత్ లు పర్ఫెక్ట్ టీం మేట్స్ గా వారి పాత్రలని అదరగొట్టారు.

తెర వెనుక టాలెంట్..

ఇలాంటి రియల్ స్టోరీతో, రియలిస్టిక్ సినిమాలు మన తెలుగులో చాలా తక్కువని చెప్పాలి. ఇలాంటి ఓ సినిమాని తెలుగు తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసిన విషయంలో డైరెక్టర్ సోలమన్ ని అభినందించాలి. యదార్థ సంఘటనల ఆధారంగా అనుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. అలాగే కథలో ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అనుకున్న పాయింట్ ని మాత్రమే చెప్పడం కూడా బాగుంది, కానీ కథలో రాసుకున్న ఇన్వెస్టిగేషన్ పాయింట్స్ మాత్రం పెద్దగా కిక్ ఇవ్వవు. ఇలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ కి కథనం చాలా చాలా ఇంపార్టెంట్. కథనం విషయంలో సోలమన్ ఇంకాస్త వర్క్ చేయాల్సింది అనిపిస్తుంది. మొదటి 30 నిమిషాలు ఎస్టాబ్లిష్ మెంట్స్ తోనే సరిపెట్టేయడం వలన బాగా స్లోగా మొదలైనట్టు అనిపిస్తుంది ఆ తర్వాత కాస్త పికప్ అందుకున్నా ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో అంత హై ఫీల్ ఇచ్చే మోమెంట్స్ లేకపోవడం వలన కాస్త బోర్ ఫీలవుతాం. సెకండాఫ్ నుంచీ ఆ టెర్రరిస్ట్ ని ఎలా పట్టుకుంటారు అనే ఫీల్ ని కాస్త జెనరేట్ చేసి, యాక్షన్ ఎపిసోడ్స్ తో మెప్పించిన థ్రిల్స్ చేసే అంశాలు తక్కువ అవ్వడం వలన ఓకే అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ గా తను అనుకున్న కథని చెప్పగలిగాడు కానీ ఆధ్యంతం ఓ ఎంగేజింగ్ స్పై థ్రిల్లర్ చెప్పడంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంటాడు. అలాగే ఇలాంటి ఓ దేశభక్తి సినిమాలో చూసే ఆడియన్స్ కి అడ్రెనలిన్ రష్ పెంచే హై మోమెంట్స్ కి అవకాశం ఉన్నా సరిగ్గా వాడుకోకపోవడం బిగ్గెస్ట్ మైనస్. యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ అండ్ కంపోజిషన్ సెకండాఫ్ లో ఊరటనిచ్చే అంశం.

శనేయిల్ డియో సినిమాటోగ్రఫీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ ఫీల్ ని ఆ విజువల్స్ లో కన్వే చేస్తే, ఆ విజువల్స్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థమన్ కనెక్ట్ చేసే ప్రయత్నంకి చేసాడు. సెకండాఫ్ లో మ్యూజిక్ హైలైట్ అని చెప్పచ్చు. శ్రవణ్ ఎడిటింగ్ కూడా బాగుంది. మురళి ప్రొడక్షన్ డిజైనింగ్ వర్క్ సూపర్బ్. కిరణ్ కుమార్ డైలాగ్స్ బాగున్నాయి. నిరంజన్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– వైల్డ్ డాగ్ గా వాహ్ అనిపించే నాగ్ నటన
– స్టోరీ పాయింట్
– బెటర్ అనిపించే సెకండాఫ్
– యాక్షన్ ఎపిసోడ్స్

బోరింగ్ మోమెంట్స్:

– ప్రారంభం కాస్త స్లోగా ఉండడం
– ఫస్ట్ హాఫ్
– బెటర్ గా ఉండాల్సిన థ్రిల్స్ అండ్ ట్విస్ట్స్
– ఎంగేజింగ్ అంశాలు లేని కథనం

విశ్లేషణ:

‘వైల్డ్ డాగ్’ అనే టైటిల్ కి తగ్గట్టు నాగార్జున పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు అనడంలో డౌట్ లేదు. కానీ అనుకున్న పాయింట్ లో దమ్మున్నా పూర్తిగా తయారైన కథ – కథనంలో అబ్బా ఇది అదిరిపోయింది, ఈ బ్లాక్ పిచ్చెక్కిపోద్ది అనుకునే అంశాలు లేకపోవడం వలన ఈ సినిమా అంత కిక్ ఇవ్వదు. అలాగే రీసెంట్ గా ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన కొన్ని స్పై థ్రిల్లర్స్ ని పోలి ఉండడం కూడా కొంత మైనస్. ఓవరాల్ గా ఒక ఫ్లోలో సాగిపోతూ ఓకే అనిపించినా, ఓవరాల్ గా ఇవ్వాల్సినంత హై ఫీలింగ్ అయితే వైల్డ్ డాగ్ ఇవ్వదని చెప్పాలి.

చూడాలా? వద్దా?: నాగ్ ఫాన్స్ ట్రై చేయచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2.5/5

సినిమా

మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా

మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. దీని...

మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు...

కమెడియన్‌ ను దర్శకుడిగా తీసుకు రాబోతున్న నాగ్‌

ఎంతో మంది దర్శకులను పరిచయం చేసిన అక్కినేని వారు మరో దర్శకుడిని పరిచయం చేసేందుకు సిద్దం అయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ లు పునః ప్రారంభం...

రష్మిక ఇంటికి వెళ్లిన ఫ్యాన్‌.. పోలీసులు అరెస్ట్‌

హీరోలు మరియు హీరోయిన్స్‌ కు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు తమ అభిమాన స్టార్స్ ను చూసేందుకు ఎంత దూరం అయినా వెళ్తారు....

ఫారెస్ట్‌ ఫ్రంట్ లైన్‌ హీరోస్‌ కోసం ఉపాసన

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల చేసే కార్యక్రమాలు అన్ని ఇన్నీ కావు. ఆమె చేస్తున్న షో లతో మరియు ఆమె...

రాజకీయం

నారా లోకేష్ పవర్ పంచ్: నడి రోడ్డు మీద కాల్చెయ్యమన్లేదు కదా.?

స్క్రిప్టు ఫాలో అవుతున్నారా.? లేదంటే, నిజంగానే నారా లోకేష్ రాజకీయ నాయకుడిగా తనలోని ‘పవర్ ఫుల్’ యాంగిల్ చూపిస్తున్నారా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిలో...

ఇసుక వర్సెస్ మట్టి.. నెల్లూరు ‘బులుగు’ ఫైట్.!

ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలు. పైగా ప్రజా ప్రతినిథులు. అందునా, కీలకమైన పదవుల్లో వున్న వ్యక్తులు. ‘పవర్’ వుంటే, దోచెయ్యాల్సిందే కదా.. అన్నట్టు, తమకు తోచిన రీతిలో దోచేస్తున్నారట. అందులో ఒకరి...

డెల్టా ప్లస్ వచ్చేసింది.. రాజకీయం చూస్తే సిగ్గేస్తోంది.!

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది రాజకీయ నాయకుల తీరు. కొందరు రాజకీయ ప్రముఖులు కరోనా మొదటి వేవ్, కరోనా రెండో వేవ్ సమయాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగా ఉప ఎన్నికలూ వచ్చాయి....

కరోనా సమయంలో పరీక్షలా.. రఘురామ మరో లేఖ

ఏపీలో అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖాస్త్రాలు కొనసాగుతున్నాయి. నవ హామీలు-వైఫల్యాల పేరుతో ఇప్పటివరకు సీఎం జగన్ కు తొమ్మిది లేఖలు రాసిన ఆయన.. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో...

విజయసాయిరెడ్డి స్థాయికి అశోక్ గజపతిరాజు దిగజారాల్సిందేనా.?

‘16 నెలలు జైల్లో వుండి వచ్చిన వ్యక్తికి అందరూ దొంగల్లానే కనిపిస్తారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది.?’ అని ఒక్క మాటతో తన మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ‘దిమ్మ తిరిగి మైండ్...

ఎక్కువ చదివినవి

ఎన్టీవీ.. ‘కోటి దీపోత్సవం’..! ఈ ఏడాదైనా జరిగేనా..?

ఎన్టీవీకి ఆధ్వర్యంలోని భక్తి చానెల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఏటా కార్తీకమాసంలో దీపోత్సవం కార్యక్రమాన్ని చేప‌డుతున్న సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమం మొద‌ట్లో ల‌క్ష దీపోత్సవంగా మొద‌లై అనంతరం కోటి...

వ్యాక్సినేషన్ రికార్డ్: వైసీపీ సర్కార్ ‘పబ్లిసిటీ’ రూటే సెపరేటు.!

ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు పదమూడున్నర లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసింది ఆంధ్రపదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొత్తంగా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలిస్తే, ఆంధ్రపదేశ్ వాటా 47...

అదేంటి లిస్ట్ లో బెల్లంకొండ సినిమా లేదు?

బాలీవుడ్ లో ప్రస్తుతం దూకుడుగా సినిమాలను నిర్మిస్తోన్న, విడుదల చేస్తోన్న సంస్థ పెన్ స్టూడియోస్. ఈ సంస్థ ఆర్ ఆర్ ఆర్ ఉత్తరాది థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతే...

టీకొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు

విద్యుత్ బిల్లుల జారీలో ఒక్కోసారి కంప్యూటర్ తప్పిదాలో లేక మానవ నిర్లక్ష్యాలో తెలియదు గానీ.. షాక్ కొట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఏకంగా లక్షల్లో కరెంటు బిల్లులు వస్తుంటాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్...

ఆంధ్రపదేశ్ ప్రభుత్వం దగ్గర 50 లక్షలు కూడా లేవా.?

చిత్తూరు జిల్లాలో ఓ రోడ్డు వేసినందుకు 21.41 లక్షల రూపాయలు ఖర్చయితే, దానికి సంబంధించిన బిల్లు ఖరారైనా చెల్లింపులు ప్రభుత్వం నుంచి జరగలేదని ఓ కాంట్రాక్టరు హైకోర్టును ఆశ్రయించారు. ఇలాంటిదే ఇంకో కేసు...