Tollywood: ప్రస్తుతం హిట్ సినిమాలకు రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ముగ్గురు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ-రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. నాగార్జున-శివ, మహేశ్-మురారి, రవితేజ-విక్రమార్కుడు సినిమాలు అత్యంత నాణ్యమైన 4k టెక్నాలజీలో రానున్నాయి.
నాగార్జున-రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో 1989 అక్టోబర్ 5న వచ్చిన శివ టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా. భారతీయ సినిమా మేకింగ్ నే మార్చేసిన శివ వచ్చి 35ఏళ్లయినా ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ ఎవరూ మరచిపోలేరు. ఆగష్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్బంగా విడుదల కానుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి మహేశ్ కెరీర్లో తొలి సూపర్ హిట్ .2001 ఫిబ్రవరి 17న విడుదలైంది. 18నిముషాల సినిమా ట్రిమ్ చేసి ఆగష్టు9 మహేశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలవుతోంది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు రవితేజ కెరీర్లో మాస్, యాక్షన్ మూవీ. దొంగ-పోలిస్ గా విభిన్నమైన పాత్రలు పోషించిన సూపర్ హిట్ మూవీ. జూలై 27న విడుదలవుతోంది.