Nagarjuna: నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఘన విజయం సాధించి ధియేటర్లలో సందడి చేస్తోంది. దీనిపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. తండ్రిగా గర్వపడుతున్నానంటూ నాగచైతన్యతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘డియర్ చైతన్య.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నీ కష్టం సినిమాలో స్పష్టంగా కనిపించింది. సినిమా కోసం నువ్వు పడ్డ కష్టం, ప్యాషన్ ఈ విజయం. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావ్. నటుడిగా ఏం చేయాలో అది చేయటం చూశా. నీ కృషికి నిదర్శనం ‘తండేల్’ .
‘అక్కినేని అభిమానులంతా సినిమాకు అండగా నిలిచారు. మీరంతా ఎప్పుడూ మా కుటుంబసభ్యుల్లా వెన్నంటే ఉంటారు. మీ అభిమానానికి, అండకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సాయిపల్లవి సినిమాకు మరో పిల్లర్. దేవిశ్రీ నువ్వు రాకింగ్ స్టార్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నావ్’.
‘రైజింగ్ స్టార్ డైరక్టర్ చందూ మొండేటి. సినిమాకు ప్రాణం పోశావు. అల్లు అరవింద్, బన్నీ వాసు. యూనిట్ కు బిగ్ థాంక్స్’ అని అన్నారు.