Nagarjuna: అక్కినేని నాగేశ్వరరావు.. మద్రాస్ కేంద్రంగా ఉన్న తెలుగు సినీ పరిశ్రమను తెలుగు నేలపైకి తీసుకురావాలనేది ఆయన ఆకాంక్ష. ఆ కలను ‘అన్నపూర్ణ స్టూడియోస్’ తో సాకారం చేసి నేటికి 50ఏళ్లు. ఈ సందర్భంగా ప్రత్యేక వీడియోలో విశేషాలు పంచుకున్నారు నాగార్జున.
‘1975 జనవరి 15న సంక్రాంతికి అన్నపూర్ణ స్టూడియోస్ పునాదిరాయి వేశారు. రోడ్లే లేని సమయంలో కొండలు, గుట్టలున్న ఈ ప్రాంతంలో స్టూడియో కట్టాలనే ఆలోచన ఆయనకెలా కలిగిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందని నమ్మే వ్యక్తి ఆయన. అందుకే మా అమ్మగారి పేరు (అన్నపూర్ణ)మీదే స్టూడియో కట్టారు’.
‘ఎందరో నటీనటులు, టెక్నీషియన్స్, సినిమాలు, కథలు ఇక్కడి నుంచే వచ్చాయి. ఏన్నార్ ఎప్పుడూ మా ఉద్యోగుల్ని కుటుంబసభ్యుల్లానే చూశారు. ప్రతి సంక్రాంతకీ వారందరితోపాటే టిఫిన్ చేయడం మాకు అలవాటు. ఏఎన్నార్ ఎందరికో స్ఫూర్తి. ఏఎన్నార్ లివ్స్ ఆన్’ అన్నారు. అక్కినేనితో స్టూడియో నిర్మాణంలో ప్రయాణం మొదలుపెట్టిన వారెందరో తమ అనుభూతుల్ని పంచుకున్నారు.