పవన్ కళ్యాణ్ తరఫున జనసేన పార్టీ నుంచి గట్టిగా మాట్లాడే నేతలెవరు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసినట్లే.. సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుంచి నర్సాపురం నియోజకవర్గ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన నాగబాబు, పార్టీ బాధ్యతల్ని కాస్త లేటుగా అయినా భుజానికెత్తుకున్నారు.
పార్టీ సంగతేమోగానీ, పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవారి ‘తాట’ తీయడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నారు. తన ట్విట్టర్ పేజ్‌లో ‘వైట్ చింపాంజీ’ ఫొటోలు పెట్టి మరీ కడిగి పారేస్తున్నారు. ‘ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైన్‌లో నిలబడి తీసుకోవాలి. కేవలం 1 కేజీ మాత్రమే. ఒక్కసారి మీరు లైన్‌లో నిలబడి తీసుకోండి. అప్పుడు తెలుస్తుంది కామన్ మ్యాన్ కష్టాలు. అవునులే.. జూలో అన్ని సదుపాయాలూ మీ దగ్గరకే వస్తాయి. మీకు తెలియదు. అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో’ అంటూ నాగబాబు తాజాగా వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, సోషల్ మీడియా వేదికగానూ మీడియా ముఖంగానూ పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి నాగబాబు తనదైన స్టయిల్లో కౌంటర్లు ఇస్తున్నారు. నాగబాబుకి హాస్యచతురత చాలా ఎక్కువ. దాన్ని రాజకీయాల్లో ప్రదర్శిస్తూ ప్రత్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాక.. జనసేన శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగకుండా వుంటుందా.? అయినాసరే, పవన్.. నాగబాబు మాత్రమే సరిపోరు.. జనసేనకు కొత్త ఉత్సాహం కావాల్సిందే. పార్టీ ముఖ్య నేతలంతా, పార్టీ వాయిస్‌ని బలంగా విన్పించి తీరాల్సిందే.
ఉల్లిపాయలు కేజీ దొరకాలంటే రెండు మూడు గంటలు లైన్ లో నిలబడి తీసుకోవాలి.కేవలం 1 కేజీ మాత్రమే.ఒక్కసారి మీరు లైన్ లో నిలబడి తీసుకోండి.అప్పుడు తెలుస్తుంది కామన్ మాన్ కష్టాలు .. అవునులే జూ లో అన్ని సదుపాయాలు మీ దగ్గరకే వస్తాయి.మీకు తెలియదు.అప్పుడప్పుడు మనుషుల కష్టాలు కూడా తెలుసుకో pic.twitter.com/NdJ7QuXRur
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 8, 2019
