Switch to English

వాళ్ళిద్దరికీ మోహన్‌బాబు క్షమాపణ చెప్పాల్సిందే: నాగబాబు

కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్న ఈ రోజుల్లో, కులం పేరు చెప్పి ఇంకా కొందరు రాజకీయాలు చేయాలనుకోవడం, ఆ రాజకీయాల్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం హేయమని సినీ నటుడు, నిర్మాత కొణిదెల నాగబాబు అభిప్రాయపడ్డారు.

ఓ ఛానల్ చర్చా కార్యక్రమంలో, చిరంజీవి కుటుంబానికి కులం ఆపాదించడం సరికాదనీ, అలాగే మోహన్‌బాబు కుటుంబానికి సైతం కులం ఆపాదించడాన్ని తాను సమర్థించనని నాగబాబు చెప్పుకొచ్చారు. అయితే, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన రచ్చ మాత్రం అత్యంత బాధాకరమని అన్నారు నాగబాబు.

సీనియర్ నటుడు బెనర్జీని బూతులు తిట్టడం, అలాగే యువ నటుడు తనీష్ మీదా తిట్ల వర్షం కురిపించడం మోహన్‌బాబు లాంటి సీనియర్ నటుడికి తగదని నాగబాబు చెప్పుకొచ్చారు. ఒకే ప్యానల్ పూర్తిగా గెలిస్తే, ఏ నిర్ణయం విషయంలో అయినా, అధ్యక్షుడి మాట చెల్లుబాటు అవుతుందనీ, ఆ కోణంలోనే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచినవారంతా, మంచు విష్ణు ప్యానెల్‌కి లైన్ క్లియర్ చేస్తూ రాజీనామాలు ఇచ్చారని నాగబాబు అభిప్రాయపడ్డారు.

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణుకి ఇకపై ఎలాంటి ఆటంకాలూ వుండవని చెప్పిన నాగబాబు, ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో మోహన్ బాబు తీరు సరిగ్గా లేదన్న నాగబాబు వెంటనే బెనర్జీ, తనీష్‌లకు క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలకాలని మోహన్ ‌బాబుని డిమాండ్ చేశారు.

‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక చాలా ఆలోచన జరిగిందన్న నాగబాబు, ప్రాంతీయ వాదంతో సంకుచిత కోణంలో ఆలోచించేవారు ‘మా’ అధ్యక్ష పదవిలో వున్నప్పుడు, వారి నేతృత్వంలో ‘మా’ నడుస్తున్నప్పుడు, తనలాంటి విశాల భావాలున్నవారు అందులో వుండడం సరికాదు గనుకనే, తాను ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు నాగబాబు.

చిరంజీవి ఏనాడూ పెద్దరికం తీసుకోలేదనీ, సాయం కోరి ఎవరు వచ్చినా చిరంజీవి చేతనైనంతవరకు సాయం చేయడమో, ఆయా సమస్యలకు పరిష్కారం చూపడమో చేశారు తప్ప, పెదరాయుడిలా తీర్పులు ఇచ్చే పని చేయలేదని నాగబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

మహేష్ థియేటర్ లో కోటి వసూలు చేసిన లవ్ స్టోరీ

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. తొలి వీకెండ్ అద్భుతమైన రెస్పాన్స్ కనబరిచిన ఈ చిత్రం...

టాలెంటెడ్ సంగీత దర్శకుడితో నాని సినిమా

న్యాచురల్ స్టార్ నాని రెగ్యులర్ గా సినిమాలను లైన్లో పెడతాడు. సినిమా సినిమాకూ మధ్య పెద్దగా గ్యాప్ తీసుకోవడం కూడా నచ్చదు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమాను షూటింగ్ కు...

ధోనీ భాయ్ తర్వాత అలాంటి వికెట్‌ కీపర్ దొరకలేదు ః కోహ్లీ

నేటి నుండి ప్రారంభం కాబోతున్న టీ20 మెగా టోర్నీలో టీం ఇండియా విజయాలతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు ఐపీఎల్‌ ఆడి వెంటనే ప్రపంచ కప్ కు సిద్దం అయిన...

చిరంజీవి కుడిచేతికి ఆపరేషన్..! ఆందోళన వద్దన్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి కుడిచేతికి శస్త్రచికిత్స జరిగింది. ఆయన కుడిచేతికి బ్యాండేజ్ ఉన్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవలు అందించిన మెగాభిమానులతో...

షూటింగ్స్ కు సమంత పెట్టే కండిషన్స్ ఇవే

అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు సమంత ప్రకటించాక ఆమెపై బోలెడన్ని రూమర్లు వచ్చాయన్న విషయం తెల్సిందే. దాన్ని ధీటుగా ఎదుర్కొన్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. దసరా సందర్భంగా...