రీసెంట్ గా నాగ శౌర్య నటించిన స్పోర్ట్స్ డ్రామా లక్ష్య ఫెయిల్ అయింది. ఆర్చరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే నాగ శౌర్య దాన్నుండి బయటపడి మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న తన కొత్త చిత్రానికి “కృష్ణ వ్రింద విహారి” అనే ఆసక్తికర టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.
ఈ చిత్రంలో నాగ శౌర్య కృష్ణుడి భక్తుడిగా కనిపించనున్నాడు. నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసారు. కృష్ణుడి భక్తుడి గెటప్ లో నాగ శౌర్య ఆకట్టుకున్నాడు.
షిర్లీ సెటియా ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి తెలుగు చిత్రం. వ్రింద పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే కృష్ణ వ్రింద విహారి షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.
757516 714144The most effective and clear News is very a lot imptortant to us. 486827
824447 537750I really like your writing style, very good info , thankyou for putting up : D. 878957