Switch to English

నాగ శౌర్య వరసగా బుక్కైపోతున్నాడుగా!

యంగ్ హీరోలు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్నారు. దూకుడుగా ఉంటూనే వేరే హీరోల పట్ల ఇతర టెక్నీషియన్స్ పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారు. బయట బిహేవియర్ కూడా కెరీర్ పై ఎఫెక్ట్ చూపిస్తుండడంతో హుందాగా వ్యవహరించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే యంగ్ హీరో నాగ శౌర్య మాత్రం అందరికీ భిన్నంగా ఉన్నాడు. అతణ్ణి కదిపితేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాడు. నాగ శౌర్య ఇతర హీరోల పట్ల, తనతో పనిచేసే వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. తనకు చాలా అర్రోగెంట్ నేచర్ ఉందని బయట టాక్ కూడా బలపడుతోంది. నాగ శౌర్య వ్యవహరిస్తున్న తీరు కూడా ఇందుకు ఒక కారణం.

తనతో పనిచేసే వాళ్లపై నిత్యం నిందలు వీస్తుండడం నాగ శౌర్యకే నెగటివ్ గా మారుతోంది. అందరితోనూ శభాష్ అనిపించుకున్న సాయి పల్లవి అంటే కణం సినిమా టైమ్ లో అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నాగ శౌర్య. ఆమెకు చాలా పొగరని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసాడు. ఆమె కారణంగా కణం ప్రమోషన్లకు కూడా హాజరు కాలేదు. అయితే సాయి పల్లవి మాత్రం ప్రతి విమర్శలు చేయడానికి ఇష్టపడలేదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది.

ఇక వెంకీ కుడుముల తన బ్యానర్ లో సినిమా తీసి సూపర్ హిట్ అందించాడు. నాగ శౌర్య రేంజ్ మారిందంటే అది ఛలో వల్లనే. అయితే ఛలో విజయంలో తన క్రెడిట్ ఎక్కువ ఉందని, వెంకీ కి రైటింగ్ రాకపోతే తానే సహాయం చేసానని, వెంకీ కి మాత్రం కృతజ్ఞత లేదని ఏదేదో మాట్లాడాడు నాగ శౌర్య. అయితే వెంకీ మాత్రం ఈ విషయంపై రెస్పాండ్ అవ్వదల్చుకోలేదు. భీష్మ సక్సెస్ తోనే ఒకరకంగా ఆన్సర్ ఇచ్చినట్లయింది. వెంకీపై విమర్శలు చేసిన శౌర్య మాత్రం అశ్వద్ధామ సినిమాతో ప్లాప్ ను అందుకున్నాడు.

ఇక రీసెంట్ గా మెహ్రీన్ తో వివాదం కూడా నాగ శౌర్య ఇమేజ్ కు మచ్చ తెచ్చింది. ఇలా వరసగా అందరితో వ్యవహరించే తీరుతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు శౌర్య.

సినిమా

వీడియో: కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న అల్లు అర్జున్

'అల వైకుంఠపురములో' సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమా 'పుష్ప' సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి లాక్ డౌన్...

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరా ఇసుకాసురులు.. ఏమా కథ.?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకీ, ఇసుక కుంభకోణాలకీ విడదీయరాని బంధం వుంది. ఏ పార్టీ అధికారంలో వున్నాసరే.. ఇసుక కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మొదలైంది ఈ ఇసుక కుంభకోణాల కథ. చంద్రబాబు హయాంలో...

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఎక్కువ చదివినవి

బ్రేకింగ్‌ గాసిప్‌: ఢిల్లీకి జగన్‌.. తన సమస్యలకి పరిష్కారం దొరికేనా?

రాష్ట్ర రాజకీయాల్లో ఓ షాకింగ్‌ గాసిప్‌ జోరుగా చక్కర్లు కొడుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల ఢిల్లీ పెద్దలు అసహనంతో...

మోడీతో నేను మాట్లాడాను అసంతృప్తితో ఉన్నారు : ట్రంప్‌

భారత్‌, చైనాల మద్య నెలకొన్న సరిహద్దు వివాదం ముదురుతోంది. కరోనా విపత్తు సమయంలో భారత్‌ దానిపై పోరాడుతుంటే చైనా మాత్రం సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించి ఆక్రమణకు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వ్యక్తం...

నిర్మాతల మండలి స్పెషల్ రిక్వెస్ట్ ని సీఎం జగన్ మన్నిస్తాడా.?

చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్టూడియోలు, ల్యాబ్స్, అలాగే నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి...

స్థానిక ఎన్నికలకు ఫ్రెష్‌ నోటిఫికేషన్‌: జనసేన డిమాండ్‌

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు రసాభాసగా ప్రారంభమైన విషయం విదితమే. ఈ క్రమంలో జరిగిన యాగీ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చోట్ల రక్తసిక్తంగా మారింది నామినేషన్ల ప్రక్రియ. ఆ...

ముంబైలో కలకలం.. రెండు గంటల్లోనే 7 కరోనా మరణాలు

కేవలం రెండు గంటల్లో కరోనా సోకిన 7గురు రోగులు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. విస్తుగొలిపే ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగింది. స్థానిక జోగేశ్వరి ఆస్పత్రిలో ఈ దారుణం...