Switch to English

చైతూపైనే ఆశలు పెట్టుకున్న రాజ్‌ తరుణ్‌

ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయం అయిన రాజ్‌ తరుణ్‌ ఆ తర్వాత సినిమా చూపిస్తా మామతో పాటు రెండు మూడు మాస్‌ సక్సెస్‌లు దక్కించుకుని జూనియర్‌ మాస్‌ మహారాజా అనిపించుకున్నాడు. అంతలోనే వరుసగా ఫ్లాప్స్‌ పడుతున్నాయి. గత రెండేళ్లుగా రాజ్‌ తరుణ్‌ చేసిన సినిమాల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా కనీసం మినిమం సక్సెస్‌ కాలేదు. దాంతో రాజ్‌ తరుణ్‌ కెరీర్‌ అనుమానంలో పడ్డట్లయ్యింది. ఆయన కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్న ఈ సమయంలో నాగచైతన్య ఆయనకు లిఫ్ట్‌ ఇచ్చేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.

గత కొన్నాళ్లుగా సమంత, నాగచైతన్యలు కలిసి ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాణ సంస్థ వర్క్‌ శరవేగంగా జరుగుతుందట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమాతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాకు రంగం సిద్దం అయ్యింది.

అయిదు కోట్లతో నాగచైతన్య ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడట. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుందని సమాచారం అందుతోంది. ఒక మంచి సబ్జెట్‌ అవ్వడంతో పాటు చైతూ సమంతలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న కారణంగా సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఈ సినిమాకు మంచి సక్సెస్‌ దక్కుతుందని రాజ్‌ తరుణ్‌ ఆశపడుతున్నాడు. మరి చైతూపై చాలా నమ్మకం పెట్టుకున్న రాజ్‌ తరుణ్‌ ఆశ నెరవేరేనా చూడాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

‘సమంత’కు పూజా క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్స్టా ఖాతాలో నిన్న వచ్చిన ఒక పోస్టు తాజాగా దుమారానికి కారణమయింది. ఆ పోస్టులో మజిలీ చిత్రంలోని సమంతా ఫోటోకు ‘ఏమంత అందంగా లేదు’ అంటూ క్యాప్షన్...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఆశాభావం.. ఇదేం రాజకీయం.?

ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ‘చేతులెత్తేసిన వైనాన్ని’ స్పష్టం చేస్తున్నాయి....

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...