అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి .. అయితే ఈ ఊహాగానాలకు తెర దించుతూ శేఖర్ కమ్ముల -నాగ చైతన్య ఇద్దరు ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో కలవడంతో ఈ న్యూస్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని స్పష్టం చేసారు. ఇందులో హీరోయిన్ గా ఫిదా ఫేమ్ సాయి పల్లవి నటిస్తుందట.
ఆగస్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. త్వరలోనే షూటింగ్ పూర్తీ చేసి డిసెంబర్ లో విడుదల చేయాలనీ ఫిక్స్ అయ్యారట. నాగ చైతన్య ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత చైతు నటించే చిత్రం ఇదే. ఫిదా సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం ఇదే.
శేఖర్ కమ్ముల మార్క్ తో తెరకెక్కే ఈ సినిమా ఫిదా రేంజ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు సినీ వర్గాలు. మొత్తానికి కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని నాగ చైతన్యకు భారీ విజయాన్ని అందిస్తాడేమో శేఖర్ కమ్ముల.