Switch to English

చైతూ, సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 3.50 )

No votes so far! Be the first to rate this post.

Movie లవ్ స్టోరీ
Star Cast నాగ చైతన్య, సాయి పల్లవి
Director శేఖర్ కమ్ముల
Producer నారాయణదాస్,పి. రామ్ మోహన్ రావు
Music పవన్ సి.హెచ్
Run Time 2 hr 36 Mins
Release 23 సెప్టెంబర్ 2021

కరోనా వల్ల పెద్ద సినిమాల విడుదల కరువయ్యింది. సెకండ్‌ వేవ్ తర్వాత వస్తున్న పెద్ద సినిమా అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఫిదా కాంబో అవ్వడం వల్ల కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నారు. లవ్‌ స్టోరీ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా రేంజ్ అమాంతం పెరిగింది. ఇది మన కథ.. మన చుట్టు కనిపించే కథ అన్నట్లుగా సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూశారు. సినిమా వచ్చేసింది మరి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దామా..!

కథ :

రేవంత్‌(నాగచైతన్య) జుంబా ట్రైనింగ్ సెంటర్ ను రన్ చేస్తూ ఉంటాడు. అతడి లైఫ్‌ అలా అలా సాగిపోతున్న సమయంలో అతడి జీవితంలోకి మౌనిక(సాయి పల్లవి) వస్తుంది. ఆమెతో పరిచయం కొత్త జీవితానికి పునాది అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మొదలు అవుతుంది. ఆ సమయంలోనే ఇద్దరి మద్య కులం అనే వారది ఏర్పడుతుంది. ఆ కులంను ఎలా ఎదుర్కొన్నారు.. పెద్దలను ఎదిరించే క్రమంలో ఏం జరిగింది.. ఇద్దరి కెరీర్ లు ఎలా ముందుకు సాగాయి అనేది కథాంశంగా సినిమా సాగుతుంది.

నటీనటులు:

నాగచైతన్య కెరీర్‌ బెస్ట్‌ ఫెర్మార్మెన్స్ ఇచ్చాడు. అతడి నటన పీక్స్ అనడంలో సందేహం లేదు. క్లైమాక్స్ లో చైతూ నటన మరింతగా ఆకట్టుకుంటుంది. నటుడిగా చైతూ చాలా అంటే చాలా పరిణతి సాధించాడు. అతడి నుండి ఇలాంటి యాక్టింగ్‌ ను ఎవరు ఎక్స్‌పెక్ట్‌ చేసి ఉండరు. అంతగా తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. ఇక ట్యాలెంట్ కు మారు పేరు అయిన సాయి పల్లవి కి మౌనిక పాత్ర అద్బుతంగా సూట్ అయ్యింది. ఫిదా భానుమతి తర్వత మళ్లీ మౌనిక పేరుతో సాయి పల్లవిని జనాలు నెత్తిన పెట్టుకుంటారు. పల్లెటూరు నుండి హైదరాబాద్‌ వచ్చే ఒక అమ్మాయిని కళ్లకు కట్టినట్లుగా సాయి పల్లవి చూపించి మెప్పించింది. ఇక సినిమాలో నటించిన ఇతర నటీ నటులు అంతా కూడా చక్కగా నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:

శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిల్మ్‌ మేకింగ్ లో మాస్టర్‌ ఆయన అనడంలో సందేహం లేదు. అలాంటి శేఖర్‌ కమ్ముల ఫిదా తర్వాత ఇంత గ్యాప్ తీసుకోవడం అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించింది. అయితే ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా వెయిటింగ్ కు ప్రతిఫలం దక్కింది అనుకునేలా ఉంది. మొత్తానికి శేఖర్‌ కమ్ముల తనమార్క్ ను కాకుండా విభిన్నమైన పాయింట్‌ ను కూడా తీసుకుని తనదైన శైలిలో టేకింగ్ ఇచ్చి సినిమా రేంజ్ ను పెంచేశాడు. స్క్రీన్‌ ప్లే కాస్త స్లోగా ఉన్నా కూడా దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్పి మెప్పించాడు. సామాజిక అంశాన్ని టచ్‌ చేస్తూ దర్శకుడు చూపించిన కథ కనెక్ట్‌ అయ్యేలా ఉంది. కొన్ని చోట్ల స్లో అనిపించినా కూడా ఓవరాల్ మాత్రం సినిమా ను శేఖర్ కమ్ముల ఆకట్టుకునే విధంగా తీశాడు. సినిమాలోని పాటలు చక్కగా ఉన్నాయి. సంగీత దర్శకుడు ది బెస్ట్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సన్నివేశాలను చాలా సహజ సిద్దంగా సినిమాటోగ్రాఫర్ చూపించాడు. ఇక ఎడిటింగ్ విషయంలో కాస్త లోపాలు ఉన్నాయి. కొన్ని సన్నివేశాలను ఇంకాస్త కట్‌ చేసి ఉంటే బాగుంది. నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటన,
  • సంగీతం.

మైనస్ పాయింట్స్:

  • నిడివి ఎక్కువ అయ్యింది,
  • క్లైమాక్స్‌,
  • స్లో కథనం.

విశ్లేషణ:

లవ్ స్టోరీ సినిమా కథ సామాజిక అంశంను టచ్ చేస్తూ చూపించడం జరిగింది. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కమర్షియల్‌ గా తీయడం అంటే సాహసమే. అయితే దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్‌ మద్య రొమాన్స్ మరియు లవ్‌ ను చక్కగా చూపించడంతో పాటు సినిమాలో అన్ని విషయాలను సమంగా ఆకట్టుకునేలా తెరకెక్కించిన దర్శకుడు శేఖర్‌ కమ్ముల అభినందనీయుడు. అయితే ఆయన నిడివి విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లుగా ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు పడాల్సింది. మొత్తంగా లవ్‌ స్టోరీ కోసం వెయిట్‌ చేస్తున్న వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.

తెలుగుబులెటిన్ రేటింగ్: 2.75/5.0

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సాయి ధరమ్ తేజ్‌ ను కలిసిన హరీష్‌ శంకర్‌

యాక్సిడెంట్‌ కు గురయ్యి చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్న సాయి ధరమ్‌ తేజ్ ను సన్నిహితులు ఇంటికి...

ముక్కు అవినాష్‌ పెళ్లి తంతు పూర్తి

కమెడియన్‌ గా తనకంటూ ఒక ప్రత్యేకతను కలిగి ఉన్న ముక్కు అవినాష్ బిగ్‌ బాస్ కు వెళ్లినప్పటి నుండి పెళ్లి పెళ్లి అంటూ హడావుడి చేశాడు....

సమంత పరువు నష్టం దావా

స్టార్‌ హీరోయిన్ సమంత మూడు యూట్యూబ్‌ ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసింది. తాను విడాకుల గురించి సోషల్‌ మీడియాలో వెళ్లడించిన సమయంలో కొన్ని...

క్లైమాక్స్ కోసమే 50 కోట్లు ఎందుకు డార్లింగ్!!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా రాధే శ్యామ్. మూడేళ్ళ క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం బోలెడన్ని అడ్డంకులను దాటుకుని షూటింగ్ ను...

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నాడా? 2022 తర్వాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయకూడదు అని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాల్లోకి...

రాజకీయం

బాబు దీక్షకు పోటీగా వైకాపా దీక్షలు

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరుకు నిరసనగా.. తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు నిరసనగా 36 గంటల దీక్షను చేసేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం...

హద్దు మీరితే ఇకపై కూడా ఇలాగే ఉంటుంది : సజ్జల

తెలుగు దేశం పార్టీ నాయకులు హద్దు మీరి దుర్బాషలాడితే పరిస్థితులు ఇలాగే ఉంటాయని.. వారు ఏం మాట్లాడినా కూడా చూస్తూ ఊరుకునేది లేదు అంటూ సజ్జల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తెలుగు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన అవసరమా.? కాదా.?

అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో...

బీపీ, రియాక్షన్… ఇదేం సమర్థన సీఎం జగన్ గారూ.?

‘ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం చూసి ఓర్వలేక నా మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు. నన్ను బూతులు తిడుతున్నారు. ఈ నేపథ్యంలో నన్ను అభిమానించేవారు, ప్రేమించేవారు బీపీకి...

ఎక్కువ చదివినవి

ధోనీ భాయ్ తర్వాత అలాంటి వికెట్‌ కీపర్ దొరకలేదు ః కోహ్లీ

నేటి నుండి ప్రారంభం కాబోతున్న టీ20 మెగా టోర్నీలో టీం ఇండియా విజయాలతో దూసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు ఐపీఎల్‌ ఆడి వెంటనే ప్రపంచ కప్ కు సిద్దం అయిన...

రష్మిక నె.1, రౌడీస్టార్ నెం.1

సెలబ్రెటీలు అంటేనే ప్రభావితం చేసే వారు అనడంలో సందేహం లేదు. వారి మాటలు లేదా వారి ప్రవర్తన ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. అందుకే వారితో పెద్ద కంపెనీల నుండి చిన్న కంపెనీలు...

నారా లోకేష్‌ ఉగ్ర స్వరూపం

ఏపీలో తెలుగు దేశం పార్టీ కార్యాలయాలపై వైకాపా శ్రేణుల దాడికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు నేడు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ పాటించేందుకు ప్రయత్నించారు. కాని పోలీసులు మాత్రం ఎక్కడికి...

బిగ్ బాస్ 5: సీక్రెట్ రూమ్ లో కూడా సేఫ్ గేమ్ ఎందుకు లోబో!- ఎపిసోడ్ 43

బిగ్ బాస్ సీజన్ 5 లో మరో ఎవిక్షన్ జరిగింది. ముందుగా ఈరోజు సన్ డే, ఫన్ డే కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా నాగార్జున కంటెస్టెంట్స్ చేత గేమ్స్ ఆడించాడు....

జస్ట్ ఆస్కింగ్: గుండెపోటు వచ్చి నరుక్కున్నట్టేనా.?

మొదట గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత గొడ్డలితో అతి కిరాతకంగా తనను తానే నరుక్కుని చచ్చిపోయాడో పెద్దాయన.! కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! బాత్రూమ్‌లో బాబాయ్ కథ ముగిసిపోయిన వైనాన్ని రాజకీయంగా ఎలా...