Switch to English

“లాల్ సింగ్ చెడ్డా” లో తెలుగుతనం ఉట్టి పడుతుంది : నాగ చైతన్య

మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లాల్ సింగ్ చెడ్డా. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా యువ హీరో అక్కినేని నాగ చైతన్య పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

అమీర్ ఖాన్ లాంటి వారితో కలసి నటించడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్సపీరియన్స్ , మూమెంట్స్ లైఫ్ లాంగ్ మనకు నేర్పిస్తుంటాయి అలాంటిదే ఈ సినిమా.

ఈ చిత్రంలో నాది కేవలం 20 నుండి 30 నిమిషాల పాత్ర మాత్రమే లాల్ (అమీర్ ఖాన్) తో కలిసి ఉంటుంది.. ఫస్ట్ టైం నాకు కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదు సాయంత్రం అమీర్ ఖాన్ డైరెక్టర్ అద్వైత్ చందన్ వీడియో కాల్ చేసి మాట్లాడినప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది.

ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా కష్టం. ఇది నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అమీర్ గారు ప్రి ప్రొడక్షన్ కు చాలా టైమ్ తీసుకోవడం వలన ఆ తరువాత తనకు షూట్ చాలా ఈజీ అవుతుంది.అది నాకు చాలా బాగా నచ్చింది. సినిమాలో లాల్ పాత్రలో నటించిన అమీర్ కు ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి చూయించకుండా అద్భుతంగా నటించాడు అమీర్ ఖాన్ గారు చాలా డిసిప్లేన్ పర్ఫెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి. తనతో నటించడం వలన తననుండి చాలా నేర్చుకున్నాను.అమీర్ లాంటి యాక్టర్ పక్కన చేయడం వలన చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ చిత్రంలో నా పాత్ర పేరు బాలరాజు. బాలరాజు క్యారెక్టర్ నాకు స్పెషల్ గా అనిపించింది.1948 లో తాతగారు ఈ టైటిల్ పేరుతో నటించిన చిత్రం సూపర్ హిట్ అయ్యిందని.నాకు చాలా హ్యాపీ అనిపించడమే కాక బ్లెస్సింగ్స్ కూడా వున్నట్టు అనిపించింది.

గుంటూరు జిల్లాలోని బోడిపాలెం దగ్గర పుట్టిన బాలరాజు అర్మీ లో జాయిన్ అయిన విధానం ఇందులో చాలా చక్కగా చూయించడం జరుగుతుంది.ఇందులో తెలుగు నేటివిటీ చాలావరకూ కనిపిస్తుంది. ఈ సినిమాను తెలుగు జిల్లాలలో కూడా షూటింగ్ చేయడం జరిగింది చిరంజీవి గారు పర్సనల్ గా తీసుకొని విడుదల చేయడం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వారందరూ చాలా బాగుందని రివ్యూస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారను ఈ మధ్య వచ్చిన రెండు సినిమాలు నిరూపించాయి.ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చడమే కాకుండా చూసిన ప్రతి ఇండియన్ కూ రిలేట్ అవుతుంది.

“వెంకీ మావా” లో నేను ఆర్మీ క్యారెక్టర్ చేసినా దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఈ చిత్రంలో కార్గిల్ లో జరిగిన ఒక సీన్ ను తీసుకొని చేయడం జరిగింది.ఇందులో కార్గిల్ వార్ సీక్వెన్స్ ఉంటాయి.హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నా కూడా పాన్ ఇండియా మూవీ అవ్వడంతో నాకు చాలా నెర్వస్ గా కూడా ఉంది. ఇది 1975 నుంచి తీసుకున్న సినిమా ఇది. కానీ పిరియాడిక్ మూవీ కాదు.

ఇండస్ట్రీ అనేది చాలా క్రియేటివిటీ ఫీల్డ్. టెక్నికల్ గా ఇక్కడికి అక్కడికి తేడా అనేది ఏమీ లేదు. ఒకదానికి ఒకదానికి నేనెప్పుడూ కంపేర్ చేసుకోను. ఒక్కో డైరెక్టర్కి ఒక్కొక్క విజనరీ, క్రియేటివిటీ ఉంటుంది. అంతే కానీ వారిని వీరిని కంపెర్ చేసుకోలేను డైరెక్టర్ అద్వైత్ చందన్ చాలా మంచి డైరెక్టర్ తను నాకు చాలా బాగా గైడ్ చేశాడు.

నాకు స్పెషల్ క్యారెక్టర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు నేను స్పెషల్ క్యారెక్టర్స్ అంటూ ఏమి చేయలేదు. ఇందులోనే మొదటిది. ఇకముందు కూడా ఇలాంటి మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను.అయితే అమీర్ గారి పక్కన చేయడం హ్యాపీ గా వుంది. అయన పక్కన చేసిన వారంతా కచ్చితంగా షైన్ అవుతారు అమీర్ ఖాన్ సినిమాను గమనిస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైలెట్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ తో పాటు అయన పక్కన ఉన్న క్యారెక్టర్ కు కూడా వ్యాల్యూ ఉంటుంది.

“బంగార్రాజు”,”థాంక్యూ” రెండు సినిమాలలో నటించినా “బంగార్రాజు” నాకు చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ లాగా అనిపించింది. అలాగే అమీర్ ఖాన్ గారు ఆన్ సెట్ లో,ఆఫ్ సెట్ లో ఉన్నా కూడా ఒకేలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేసినా కూడా ఆయన పాత్ర నుంచి బయటకు రారు అంత డెడికేటెడ్ గా ఉంటారన్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

జనసేనాని పవన్ కళ్యాణ్‌కి అండగా చిరంజీవి నిలబడతారా.?

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ పని చేశారు. మరి, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి ఎందుకు కనీసం మద్దతివ్వలేదు.? 2019 ఎన్నికల్లో చిరంజీవి రాజకీయంగా...

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త: వైఎస్ జగన్‌కి ఎమ్మెల్యే బాలకృష్ణ హెచ్చరిక.!

‘మార్చెయ్యడానికీ, తీసెయ్యడానికీ ఎన్టీయార్ అన్నది పేరు కాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక..’ అంటూ సినీ నటుడు, టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ...

జ్యోతిలక్ష్మి, జయమాలిని పాటలకు డాన్సులేసేవాళ్ళు రైతులా.?

ఆయనో వైసీపీ నేత.! అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనీ, కూకట్‌పల్లి ఆంటీలనీ అభివర్ణించిన పార్టీకి చెందిన నాయకుడు కదా.? జ్యోతిలక్ష్మి, జయమాలిని పాటలకు డాన్సులేసేవాళ్ళు రైతులా.? అని ఆయన ప్రశ్నించడంలో వింతేముంది.? ఓ...

ఫోటో మూమెంట్: రామ్ చరణ్ ఇంట సందడి చేసిన భారత క్రికెటర్లు

ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నిన్న మూడో టి20 మ్యాచ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెల్సిందే. లాస్ట్ ఓవర్ వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో...

నేహా చౌదరి ‘వైల్డ్ కార్డ్ రీ-ఎంట్రీ’ ఖాయమైపోయిందా.?

బిగ్ బాస్ రియాల్టీ షో అంతా గజిబిజిగానే కొనసాగుతోంది. ప్రతి సీజన్‌లోనూ పరిస్థితి ఇంతే. కాకపోతే, ఈసారి ఆ గందరగోళం ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది. అసలు హౌస్‌లోకి కంటెస్టెంట్లు ఎందుకు వెళ్ళారు.? అన్నదానిపై...