నాగచైతన్య-శోభిత ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నారు. డిసెంబర్ 4న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. దివంగత అక్కినేని నాగేశ్వర్ రావు ఫొటో ముందు వీరి పెళ్లి చేయబోతున్నారు. ఇప్పటికే సమంతతో విడిపోయి నాలుగేళ్లు గడిచాయి. చైతూ ఎవరిని పెళ్లి చేసుకుంటాడో అని అందరూ ఎదురు చూస్తుండగా.. చివరకు రూమర్ గర్ల్ ఫ్రెండ్ శోభితతోనే పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక పెళ్లికి రెడీ అవుతున్న క్రమంలోనే తాజాగా వీరిద్దరూ పెళ్లి పనులను ప్రారంభించారు.
తాజాగా ఈ జంట హల్దీ వేడుకలను నిర్వహించుకున్నారు. బంధువులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిపారు. స్నేహితులు వారికి మంగల స్నానాలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన వారంతా విషెస్ చెబుతున్నారు. ఇక నాగచైతన్య పూర్తిగా పెళ్లి పనుల్లోనే బిజీగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అటు అఖిల్ కూడా సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. 2025లో అఖిల్ పెళ్లి కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో అక్కినేని ఇంట వరుసగా ఈవెంట్లు జరగబోతున్నాయి.
దీంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున కొడుకులు ఇద్దరూ ఒకేసారి సెట్ అయిపోయినట్టే అంటున్నారు.