యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తండేల్ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమాను బన్నీ వాసు భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమాలో నాగ చైతన్య రాజు పాత్రలో నటించగా కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా తన పూర్తిస్థాయి మేకోవర్ తో పాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాలో సాయి పల్లవి మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. తండేల్ సినిమా రిలీజైన తొలి రోజే హెచ్.డి ప్రింట్ పైరసీ బయటకు వచ్చినా కూడా సినిమాను ఆడియన్స్ థియేటర్ లోనే చూసేందుకు ఆసక్తి చూపించారు.
తండేల్ సినిమా ఫస్ట్ డే నుంచి భారీ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా సినిమా 1 మిలియన్ మార్క్ దాటేసింది. సినిమాపై నమ్మకం ఉండటం వల్లే నిర్మాత బన్నీ వాసు రిలీజ్ ముందే తండేల్ 100 కోట్లు కొడుతుందని చెప్పారు. ఇప్పుడు ఆయన మాట ప్రకారంగానే తండేల్ తో నాగ చైతన్య 100 కోట్లు కొల్లగొట్టాడు. పోటీగా సరైన సినిమా లేకపోవడం వల్ల సినిమా రిలీజై రెండు వారాలు అవుతున్నా కూడా తండేల్ ఈ వీకెండ్ కూడా అదరగొట్టేస్తుంది.
100 కోట్లు దాటిన నాగ చైతన్య తండేల్ ఈ వారం కూడా మంచి వసూళ్లను రాబట్టేలా ఉండగా ఫుల్ రన్ లో సినిమా రికార్డ్ వసూళ్లను తెచ్చేలా ఉంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్స్ అంతా లాభాలు తెచ్చుకున్నారని తెలుస్తుంది.