అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా తండేల్. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేసింది.
శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాగ చైతన్య నటన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజర్ హైలెట్స్ గా నిలిచిన ఈ సినిమా సక్సెస్ అయినందుకు చిత్ర యూనిట్ అంతా సంతోషంగా ఉన్నారు. ఐతే ఈ సినిమా రిలీజైన రోజే పైరసీ భారిన పడినట్టుగా తెలుస్తుంది. అది కూడా తండేల్ సినిమా HD ప్రింట్ ఆన్ లైన్ లో కనబడుతుంది.
తండేల్ HD ప్రింట్ ఆన్ లైన్ లో చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇప్పటికే చాలా డౌన్ లోడ్స్ జరిగాయని తెలుస్తుంది. నిర్మాతలు ఆ లింక్ ని బ్లాక్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్ల బడ్జెట్ తో తీసే సినిమాలు ఇలా రిలీజ్ అయిన రోజే పైరసీ భారిన పడటం పరిశ్రమకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇంతకీ తండేల్ HD ప్రింట్ ఎలా లీక్ అయ్యింది..? దాని వెనక ఉన్నది ఎవరు..? ఈ విషయంపై నిర్మాతలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది.