తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య టైర్ 2 హీరోల్లో టాప్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. వీకెండ్ వరకే కాదు సోమవారం కూడా తండేల్ కలెక్షన్స్ అదిరిపోయినట్టు తెలుస్తుంది. నాగ చైతన్య మాస్ విధ్వంసానికి అక్కినేని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఐతే వారి జోష్ మరింత పెంచే న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తుంది.
నాగ చైతన్య తండేల్ సినిమా ప్రెస్ మీట్ లోనే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నెక్స్ట్ నాగ చైతన్యతో ఒక మాస్ సినిమా చేస్తామని అన్నారు. ఐతే తండేల్ రిలీజ్ ముందు కదా ప్రమోషన్ కోసం అని అనుకున్నారు. కానీ తండేల్ కొట్టిన సక్సెస్ చూసి ఇప్పుడు ఆ మూవీని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే అని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బోయాపాటితో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉంది.
సరైనోడు తర్వాత మరో సినిమా ఆ బ్యానర్ లో చేయాలని ఎదురుచూస్తున్నాడు బోయపాటి శ్రీను. ఐతే అల్లు అర్జున్ హీరోగా బోయపాటి సినిమా ఉంటుందని అనుకోగా పుష్ప 2 తో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది కాబట్టి బోయపాటికి నాగ చైతన్యను ఇచ్చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి బోయపాటి శ్రీనుతో నాగ చైతన్య సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ కి మాస్ మసాలా ఫీస్ట్ పక్కా అన్నట్టే లెక్క.